జీవిత సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న కైకాల
ఆత్మకూరు(మంగళగిరిటౌన్): రాజధాని అభివృద్ధికి సినీ రంగం కూడా కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునించారు. శనివారం రాత్రి మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలోని హ్యాపీ రీసార్ట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి ఉగాది పురస్కారాల వేడుకల కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. చలన చిత్ర అవార్డుల కమిటి చైర్మన్ అంబటి మధుమోహనకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పుల్లారావు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
తుళ్లూరు మండలంలోని అనంతవరం గ్రామం వద్ద మీడియా సిటి నిర్మిసామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, విశాఖపట్టణంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం పలు ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు. ఈ సదర్భంగా ప్రముఖ సినీనటుడు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ సినీకళాకారునిగా, ఎంపిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని, నటనలో తనదైన శైలిలో సత్యనారాయణ తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.
కైకాలకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం...
ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు కైకాల సత్యనారాయణ 750 చిత్రాలలో విలక్షణపాత్రలను పోషించి, చిత్రసీమకు పేరు ప్రఖ్యాతలను తీసుకు వచ్చేందుకు తనదై శైలిలో విశేష కృషి చేశారని తెలిపారు. చలనచిత్ర అవార్డుల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతులు మీదుగా సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. సత్యనారాయణతో పాటు ఉత్తమ దర్శకులుగా గరుడవేగ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్, మళ్లీరావా చిత్ర దర్శకుడు గీతంనాయుడుకు, శేఖరం గారి అబ్బాయి చిత్రం దర్శకుడు అక్షిత్‌శ్రీనివాసన్, ఒక్కడే మిగిలాడు చిత్ర దర్శకుడు అజెయ్ ఆడ్రూస్‌లకు ఉత్తమ దర్శకులు అవార్డులను ప్రదానం చేవారు. ఉత్తమ నటులు రవివర్మ(గరుడవేగ), అప్పాజి(మళ్లిరావే), ఉత్తమ నటి సాయిసుధభీమిరెడ్డి(అర్జున్‌రెడ్డి), హిమజ(శతమానంభవతి), కల్పాలిత్(బహుబలి2), ఉత్తమ నిర్మాతలు రాహుల్‌యాదవ్(మళ్లీరావే), దిల్‌రాజు(ఫిదా), త్తమ గాయకురాలు సోని(బహుబలి2), సంగీత దర్శకులు శక్తీకార్తిక్(ఫిదా) ప్రత్యేక పురస్కారాలు సౌమ్యావేణుగోపాల్(కాటమరాయుడు), మనారాచోప్రా(రోగ్), మనాలీరాథోడ్(లేడీస్‌టైలర్), సోనీచరిస్టా(టాప్‌ర్యాంకర్)గా ఎంపికైయ్యారు.
జీవిత సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న కైకాల
Comments
Please login to add a commentAdd a comment