pulla rao
-
రాజధాని అభివృద్ధికి సినీ నటులు కృషి చేయాలి
ఆత్మకూరు(మంగళగిరిటౌన్): రాజధాని అభివృద్ధికి సినీ రంగం కూడా కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునించారు. శనివారం రాత్రి మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలోని హ్యాపీ రీసార్ట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి ఉగాది పురస్కారాల వేడుకల కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. చలన చిత్ర అవార్డుల కమిటి చైర్మన్ అంబటి మధుమోహనకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పుల్లారావు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తుళ్లూరు మండలంలోని అనంతవరం గ్రామం వద్ద మీడియా సిటి నిర్మిసామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, విశాఖపట్టణంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం పలు ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు. ఈ సదర్భంగా ప్రముఖ సినీనటుడు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ సినీకళాకారునిగా, ఎంపిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని, నటనలో తనదైన శైలిలో సత్యనారాయణ తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. కైకాలకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం... ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు కైకాల సత్యనారాయణ 750 చిత్రాలలో విలక్షణపాత్రలను పోషించి, చిత్రసీమకు పేరు ప్రఖ్యాతలను తీసుకు వచ్చేందుకు తనదై శైలిలో విశేష కృషి చేశారని తెలిపారు. చలనచిత్ర అవార్డుల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతులు మీదుగా సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. సత్యనారాయణతో పాటు ఉత్తమ దర్శకులుగా గరుడవేగ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్, మళ్లీరావా చిత్ర దర్శకుడు గీతంనాయుడుకు, శేఖరం గారి అబ్బాయి చిత్రం దర్శకుడు అక్షిత్శ్రీనివాసన్, ఒక్కడే మిగిలాడు చిత్ర దర్శకుడు అజెయ్ ఆడ్రూస్లకు ఉత్తమ దర్శకులు అవార్డులను ప్రదానం చేవారు. ఉత్తమ నటులు రవివర్మ(గరుడవేగ), అప్పాజి(మళ్లిరావే), ఉత్తమ నటి సాయిసుధభీమిరెడ్డి(అర్జున్‌రెడ్డి), హిమజ(శతమానంభవతి), కల్పాలిత్(బహుబలి2), ఉత్తమ నిర్మాతలు రాహుల్‌యాదవ్(మళ్లీరావే), దిల్‌రాజు(ఫిదా), త్తమ గాయకురాలు సోని(బహుబలి2), సంగీత దర్శకులు శక్తీకార్తిక్(ఫిదా) ప్రత్యేక పురస్కారాలు సౌమ్యావేణుగోపాల్(కాటమరాయుడు), మనారాచోప్రా(రోగ్), మనాలీరాథోడ్(లేడీస్టైలర్), సోనీచరిస్టా(టాప్‌ర్యాంకర్)గా ఎంపికైయ్యారు. జీవిత సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న కైకాల -
స్పెషల్ గ్రేడ్ కలెక్టర్‌గా రహ్మతుల్లా
గుంటూరు వెస్ట్ : రాజధాని ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ గ్రేడ్ కలెక్టర్‌గా రహంతుల్లాను నియమిస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పనుల కల్పనపై గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాలులో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ అధ్యక్షత వహించారు. సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రవాణా సౌకర్యం కల్పించి ఇతర గ్రామాలకు పనులకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశానికి హాజరైన తాడికొండ ఎంఎల్ఏ తెనాలి శ్రావణ్‌కుమార్ రాజధాని ప్రాంత పరిధిలోని గ్రామాల్లోని ప్రజలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఉపాధి హామీ పథకం కింద ఆయా గ్రామాల ప్రజలకు పనులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమ ంలో జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపా టి శ్రీధర్, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూ న్, డిప్యూటీ చైర్మన్ వి.పూర్ణచంద్రరావు, డ్వామా ఇన్చార్జి పి.డి బాలాజీనాయక్, అధికారులు పాల్గొన్నారు. -
గడువు పొడిగింపు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ గడువు తేదీని ఈ నెల 28 వరకు పొడిగించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించినా, రాజధాని గ్రామాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూ సమీకరణకు తుళ్లూరు రైతులు సానుకూలంగా ఉన్నప్పటికీ తాడేపల్లి, మంగళగిరిలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వీరంతా భూ అంగీకార పత్రాలకు బదులు అభ్యంతర పత్రాలు ఇస్తున్నారు. భూ సమీకరణ ప్రక్రియ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జరగకపోవడంతో గడువు ముగిసేరోజుకు (శనివారం) 21, 627 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. గడువు పొడిగింపుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినప్పటికీ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. అయినా భూ సమీకరణ పూర్తవుతుందనే నమ్మకం అధికారుల్లో కలగడం లేదు. ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరిలో వైఎస్సార్ సీపీతోపాటు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉండవల్లి, పెనుమాక గ్రామాల సరిహద్దులో ఁమన భూమి కోసం రైతు దీక్ష రూ. పేరుతో రైతులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఇతర సీనియర్ నేతలు రామచంద్రయ్య, జేడీ శీలం, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకుడు తిరునవక్కన్ తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన అన్ని రకాల హామీలు తక్షణమే నేర వేర్చేందుకు కేంద్రపై ఒత్తిడి తెస్తూ ఈ నెల 28న పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర నాయకులు పాల్గొని సారవంతమైన భూముల్లో సమీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ముగింపు కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తదితరులు పాల్గొని భూ సమీకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు భూ సమీకరణకు రైతులు సహకరించకపోయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా గడువు తేదీని పొడిగించుకుంటూ వెళుతోంది. భూ సమీకరణకు ఎలాంటి చట్టబద్ధత లేదని చెప్పడానికి ఈ గడువు పొడిగింపు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ మిగిలిన రోజుల్లోనూ అభ్యంతర పత్రాలు ఇవ్వాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రైతుల్ని వ్యక్తిగతంగా కలిసే యత్నం ... ఈ నెలాఖరు వరకు భూ సమీకరణను వేగవంతం చేసేందుకు అధికార పార్టీ మరో ప్రయత్నాన్ని చేపడుతోంది. భూ అంగీకారపత్రాలు ఇవ్వని రైతుల్ని పార్టీనేతలు, అధికారులు వ్యక్తిగతంగా కలుసుకుని రాజధాని ఏర్పాటు ఆవశ్యకత, రైతులకు ఇచ్చే ప్యాకేజీ, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని మంత్రి పుల్లారావు చెప్పారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందన్నారు. -
పేటలో ఆటవిక పాలన
చిలకలూరిపేట: మంత్రి నియోజకవర్గంలో దౌర్జన్యాలు, అరాచకాలు పెచ్చుమీరాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దంపతుల దౌర్జన్యాలకు నిరసనగా బాధిత కుటుంబాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి సతీమణి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా, షాడో మంత్రిగా మారి అరాచకాలకు కారణమౌతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అభిమానులను టార్గెట్ చేస్తూ వారిని వేధించడం సరికాద ని హితవుపలికారు. వైఎస్సార్సీపీకి మద్దతు పలికారన్న కోపంతో స్థానిక కేబుల్ నెట్వర్కులో 20 ఏళ్లుగా భాగస్వాములుగా ఉన్న వారి వాటాను బలవంతంగా లాక్కొని బయటకు నెట్టివేశారని విమర్శించారు. వ్యాపారాలు కోల్పోయిన ఆపరేటర్లు కుటుంబాలు నడిబజారులో నిలబడాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. దౌర్జన్యంతో ఆస్తులను రాయించుకోవటం ఏ సంప్రదాయమని ప్రశ్నించారు. రేషను కార్డులు, ఫించన్లు తొలగించి నిరుపేదల, వృద్ధుల కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల తరుపున తమ పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. కేబుల్ ఆపరేటర్ల వాటా వారికే అప్పగించాలని, తొలగించిన ఫించన్లు, రేషన్‌కార్డులను పునరుద్ధరించాలని, స్థానిక విలేకరి శంకర్ హత్యకేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీకి మద్దతు పలికామనే మంత్రి, ఆయన సతీమణి ప్రోద్బల్యంతో తమ వాటాలు లాక్కొన్నారని దీక్షల్లో వారి కుటుంబసభ్యులతో కూర్చొన్న బాధిత ఆపరేటర్లు ఆరోపించారు. కేబుల్ టీవీలో మంత్రికి 50 శాతం వాటా ఇవ్వటానికి ఈ ప్రయత్నాలు కొనసాగాయని తెలిపారు. ప్రసారాలు నిలిపివేసి, కనెక్షన్లు కట్ చేసి భయానక వాతావరణం సృష్టించారని వాపోయారు. ప్లెక్సీ తొలగింపుతో ఉద్రిక్తత.. దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసు అధికారులు వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, మంత్రి పేరుతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించాలని కోరారు. దీనికి మర్రి రాజశేఖర్ ప్రజాసామ్యయుతంగానే దీక్షలు చేస్తున్నామని, బాధితులు తమ ఆవేదన కూడా చెప్పుకోవటానికి వీలులేదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఆయనకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు బలవంతంగా ప్లెక్సీని తొలగించడంతో వారి చర్యకు నిరసనగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమానికి పార్టీ పట్టణ కన్వీనర్ ఎ.వి.ఎం.సుభానీ అధ్యక్షత వహించగా మాజీ కౌన్సిలర్ పటేల్(కొప్పురావూరి నాగేశ్వరరావు), కట్టా సీతమ్మ, సావిత్రి తదితరులు బాధితులకు మద్దతుగా దీక్షల్లో పాల్గొన్నారు.