గుంటూరు వెస్ట్ : రాజధాని ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ గ్రేడ్ కలెక్టర్‌గా రహంతుల్లాను నియమిస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల కల్పనపై గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాలులో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ అధ్యక్షత వహించారు.
సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రవాణా సౌకర్యం కల్పించి ఇతర గ్రామాలకు పనులకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశానికి హాజరైన తాడికొండ ఎంఎల్‌ఏ తెనాలి శ్రావణ్‌కుమార్ రాజధాని ప్రాంత పరిధిలోని గ్రామాల్లోని ప్రజలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఉపాధి హామీ పథకం కింద ఆయా గ్రామాల ప్రజలకు పనులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమ ంలో జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపా టి శ్రీధర్, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూ న్, డిప్యూటీ చైర్మన్ వి.పూర్ణచంద్రరావు, డ్వామా ఇన్‌చార్జి పి.డి బాలాజీనాయక్, అధికారులు పాల్గొన్నారు.
స్పెషల్ గ్రేడ్ కలెక్టర్‌గా రహ్మతుల్లా
Published Fri, Jul 3 2015 12:51 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement