సాక్షి, అమరావతి: మంగళగిరిలో నారా లోకేశ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతు పెరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న పద్మశాలీలు ఆర్కేకు మద్దతు ప్రకటించారు.
సోమవారం జరిగిన చేనేతల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ బుట్టా రేణుక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి నేతన్నలు పూర్తి మద్దతు తెలిపారు. మంగళగిరిలో బీసీలను నమ్మించి టీడీపీ మోసం చేసిందని, తమకు జరిగిన అన్యాయాన్ని ఓటుతో ఎదుర్కొంటామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, చేనేత సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చదవండి: లోకేశ్‌కు బుద్ధి చెబుతాం)
Comments
Please login to add a commentAdd a comment