Padmashali community
-
ఏంటీ, పెళ్లిలో నాన్‌వెజ్ లేదా?.. మూడు దశాబ్దాలుగా ఇదే ఆచారం!
‘పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, మంథని ప్రాంతానికి చెందిన ఎంపీపీలు, పలువురు ప్రజాప్రతినిధులు ఇటీవల సిరిసిల్లలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వదించి భోజనాలకు ఉపక్రమించారు. విందులో పప్పు, పచ్చిపులుసు, పప్పుచారు, వంకాయ, టమాట, గోబీఫ్రై, ఆలుగడ్డ కర్రీ, మిర్చి, స్వీట్లను చూసి అవాక్కయ్యారు. నాన్‌వెజ్ లేదా..! అని పుట్ట మధు ప్రశ్నించారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో నాన్‌వెజ్ పెట్టరని, ఓన్లీ వెజ్ మాత్రమే వడ్డిస్తారని చెప్పడంతో మధుతో పాటు, మంథని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు షాకయ్యారు.’ సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే మొదటగా అతిథులకు రుచికరమైన భోజనం వడ్డించాలని ఆలోచన చేస్తారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా పెళ్లిల్లో మాంసాహారానికి అగ్రతాంబూలం ఉంటుంది. కానీ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఎంతపెద్ద కోటీశ్వరులైనా.. పేదోళ్లయినా పెళ్లిళ్లలో శాకాహారం.. సాత్విక ఆహారంతోనే విందు చేస్తారు. ఇది నిన్న, మొన్నటి విధానం కాదు.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో కొనసాగుతోంది. లక్ష జనాభా ఉన్న పట్టణంలో పద్మశాలీ సమాజమే 80శాతం ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలు స్తున్న ఆ సాంప్రదాయంపై సండే స్పెషల్.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో శాకాహారం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మొదలైన ఆచారం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, రాజీవ్‌నగర్, తంగళ్లపల్లిలోనూ శాకాహార భోజనాలనే పెళ్లిలో వడ్డిస్తున్నారు. సంఘం స్ఫూర్తి.. అదే కీర్తి 1992లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం పెద్దలుగా ఉన్న రుద్ర శంకరయ్య, గూడూరి పర్శరాం, గున్నాల రామచంద్రం, కొండ శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, కుడిక్యాల రాజారాం పెళ్లిలో శాకా హారం వడ్డించాలని తీర్మాణం చేసి అమలు చేశారు. కొద్ది రోజులకే శాంతినగర్‌లోని ఓపెళ్లిలో ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం పెద్దలందరూ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేయకుండా వెనుదిరిగారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పెళ్లి పెద్దలు సైతం మరుసటి రోజే సంఘం పెద్దవద్దకు వచ్చి పొరపాటైందని అంగీకరించారు. 1993 నుంచి సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పద్మశాలీ సమాజం శాకాహార భోజనాలు వడ్డిస్తున్నారు. రిసెప్షన్ వేడుకల్లో వారి ఇష్టం ఆర్థిక అసమానతలున్న సిరిసిల్లలో శాకాహార భోజనం అందించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు మాంసాహారాన్ని బంద్ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శాకాహార భోజనం పెట్టి, మరుసటి రోజు పెళ్లి రిసెప్షన్లో (విందులో) మాంసాహార భోజనాలు పెడుతుంటారు. ఇది వారి వ్యక్తిగతం పెళ్లిలో మాత్రం మాంసాహారం ఉండదు. సాత్వికాహారం ఆరోగ్యానికి మంచిదని పద్మశాలీ సంఘం పెద్దలు నిర్ణయించారు. అందరూ తింటారు శాకాలతో భోజనం పెడితేనే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం ఖర్చుతో కూడుకున్న పని. కూరగాయల భోజనమైతే అందరు చేస్తారు. శాకాహారమైతే అందరికీ బాగుంటుంది. సిరిసిల్ల పద్మబ్రాహ్మణులు, సంఘం పెద్దలు శాకాహార భోజనం విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చి.. స్ఫూర్తిగా నిలిచారు. – కాముని వనిత, పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు, సిరిసిల్ల చాలా ప్రాంతాల్లో.. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిలో నాన్ వెజ్ పెట్టవద్దని తీర్మాణాలు చేశారు. అందరికీ సిరిసిల్ల స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆయా ప్రాంతాల్లో సంఘాల పర్యవేక్షణ లేక కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.. కొన్ని గ్రామాల్లో ఉల్లంఘించారు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా మారింది. సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా అమలవుతోంది. – కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు ఇప్పటికీ అమలవుతోంది చాలా ఏళ్ల కిందట పద్మశాలీ సంఘం పెద్దలు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికీ అమలవుతోంది. పెళ్లిళ్లలో మాంసం వద్దని తీర్మానం చేశారు. అన్ని రకాలుగా అదే మంచిదని అందరూ భావించారు. ఉన్నవాళ్లు ఉంటారు.. లేనివాళ్లు ఉంటారు.. అందరూ సమానమే అని చెప్పడం కోసం శాకాహార భోజనాలను అమలు చేస్తున్నాం. – గోలి వెంకటరమణ, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల -
ప్రతి బీసీ కులాన్ని చైతన్యం చేయడమే సీఎం జగన్ ఆశయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: అట్టడుగులో ఉన్న బీసీ కులాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయడమే సీఎం జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీల సమస్యలను రాజకీయంగా వాడుకుంటూ వారికి సమాజంలో కనీస గుర్తింపు లేకుండా చేసిన వైనాన్ని సీఎం జగన్ తన పాదయాత్రలో చూశారని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బీసీల అభ్యున్నతి కోసం కసరత్తు మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఈక్రమంలోనే బీసీలలో చాలామందికి తెలియని కులాలను కూడా వెతికి ఆ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేశారని వివరించారు. ఆ కార్పొరేషన్లతో ప్రతి బీసీ కులాన్ని చైతన్యవంతంగా మార్చడం సీఎం ఆశయమని వెల్లడించారు. చదవండి: లవ్ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్బుక్ తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పద్మశాలి కార్పొరేషన్ సమావేశంలో సజ్జల మాట్లాడారు. దేశానికి కళాత్మకమైన చేతి వృత్తి చేనేత అని, ప్రపంచంలోనే చేనేత వస్త్రాలకు గొప్ప ఆదరణ ఉందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఆయన సూచించారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న ఆఖరి వ్యక్తికి అందేలా చూడటం మన లక్ష్యమని సజ్జల స్పష్టం చేశారు. చదవండి: సాయి తేజ్ మూడు రోజుల్లో బయటకు వస్తారు.. మోహన్‌బాబు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో సీఎం జగన్ బీసీలను భారతీయ సంస్కృతిగా అభివర్ణించారని గుర్తుచేశారు. బీసీలను సమాజానికి వెన్నెముకలా మార్చాలని సీఎం ఆశయమని తెలిపారు. నేతన్న నేస్తం ద్వారా కరోనా కష్టకాలంలో చేనేత కుటుంబాలకు సీఎం జగన్ భరోసా కల్పించారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఆప్కో చైర్మన్ మోహన్ రావు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్
నెల్లూరు : పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన పద్మశాలి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన మంత్రి వారికి పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నగరంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు వైఎస్సార్సీపీ నాయకులు ముక్కాల ద్వారకనాథ్, వైవీ రామిరెడ్డి, సంక్రాంతి కల్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, పద్మశాలి నాయకులు అశ్వత్థామ, బాలజీ, దోనుపర్తి గిరిలు పాల్గొన్నారు. -
అలరించిన ‘మల్లేశం’ యూనిట్
ఖమ్మంమయూరిసెంటర్: చేనేత కార్మికురాలైన తల్లి కష్టాలను చూసి చలించి, ఆ కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో ఆసుయంత్రం కనుగొని జాతీయ గుర్తింపు పొంది, పద్మశ్రీ అవార్డు అందుకున్న చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం నగరంలోని సాయిరాం థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించారు. సినీ డైరెక్టర్ రాజు, కథానాయిక అనన్య, హీరో తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించిందని, చింతకింద మల్లేశం జీవిత కథ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఖమ్మం నగర పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు, పద్మశాలీ సంఘ కుటుంబ సభ్యులకు ఉచితంగా సినిమా టికెట్లను అందజేశారు. సినిమా విజయంతం కావడాన్ని హర్షిస్తూ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం చిత్ర బృందాన్ని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. -
చికాగోలో సామూహిక వనభోజనాలు
చికాగో : నాపా (నార్త్ అమెరికా పద్మశాలీ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక వనభోజనాల కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 250 పద్మశాలీ కుటుంబాలు పాల్గొన్నాయని నాపా తెలిపింది. స్వర్గీయ అజయ్ మెతుకు(నాపా వ్యవస్థాపకులు)కు నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న అందరూ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ వంటకాలతో అంరదరి నోరూరించారు. చికాగో బృందం పద్మశ్రీ రామారావు (పద్మశాలీ సంఘం మాజీ అధ్యక్షుడు) సత్కరించింది. ఈ ఈవెంట్‌ను నిర్వహించిన చికాగో చాప్టర్ డైరెక్టర్ రాజ్ అడ్డగట్ల, బోర్డ్ సభ్యులు ఈశ్వర్ గుమిడ్యాల, వేణు పిస్కా, ట్రెజరర్ రామ్రాజ్ అవదూత.. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను సత్కరించారు. టీమ్ సభ్యులు రాజ్ గెంట్యాల, శ్రీమాన్ వంగరి, రవి కూరపాటి, శ్రీనివాస్ దామర్ల, విమల్ దాసి, శ్రీనివాస్ కైరంకొండ, సాయిరామ్ పసికంతి, ప్రవీణ్ కటకం, శ్రీనివాస్ వేముల సహాకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని నాపా తెలిపింది. 2019 సెప్టెంబర్ 14న జరిగే వార్షికోత్సవానికి హాజరు కావల్సిందిగా కార్యక్రమానికి పాల్గొన్నవారందరినీ కోరారు. ఈ కార్యక్రమానికి నాపా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సంతోష్ అంకెం, దేవాంగ్ అసోసియేషన్ ఫౌండర్ వెంకటేశ్వర్ రావు బట్చు, రవి బోధులా హాజరయ్యారు. -
మంగళగిరిలో కీలక పరిణామం
సాక్షి, అమరావతి: మంగళగిరిలో నారా లోకేశ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతు పెరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న పద్మశాలీలు ఆర్కేకు మద్దతు ప్రకటించారు. సోమవారం జరిగిన చేనేతల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ బుట్టా రేణుక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి నేతన్నలు పూర్తి మద్దతు తెలిపారు. మంగళగిరిలో బీసీలను నమ్మించి టీడీపీ మోసం చేసిందని, తమకు జరిగిన అన్యాయాన్ని ఓటుతో ఎదుర్కొంటామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, చేనేత సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చదవండి: లోకేశ్‌కు బుద్ధి చెబుతాం) -
లోకేశ్‌ను ఓడించి తీరుతాం!
సాక్షి, అమరావతి బ్యూరో/ సాక్షి, అమరావతి: పద్మశాలీలకు సంబంధించిన మంగళగిరి అసెంబ్లీ సీటును కబ్జా చేసిన నారా లోకేష్‌ను ఓడించి తీరుతామని రాష్ట్ర పద్మశాలి సంఘం తీర్మానించింది. ఆదివారం విజయవాడలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి 13 జిల్లాల నుంచి పద్మశాలీలు, ముఖ్యనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఎఎన్ మూర్తి మాట్లాడుతూ.. పద్మశాలీలకు టికెట్ల కేటాయింపుల్లో అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు. ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం నుంచి తమ సామాజిక వర్గం ఆ పార్టీకి పల్లకీ మోసిందని.. అయితే నేడు ఆ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో పద్మశాలీలు అధికంగా ఉన్న మంగళగిరి సీటును తమకు కేటాయించకుండా సీఎం తన కుమారుడికి కేటాయించి పద్మశాలీల సీటును కబ్జా చేశాడన్నారు. ఇప్పటికే హిందూపురం, చీరాల, ధర్మవరం, వెంకటగిరి స్థానాలను వదులుకున్నామని.. ఇప్పుడు మంగళగిరిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంగళగిరిలో తమ సీటును కబ్జా చేసిన సీఎం, లోకేశ్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అక్కడ స్వతంత్య్ర అభ్యర్థిని పోటీలో పెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 9 శాతం ఉన్న మాకు ఒక్క సీటు ఇవ్వరా.. రాష్ట్ర జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న పద్మశాలీలకు టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవటం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని సమావేశంలో పద్మశాలి నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరి ప్రాంతంలో కొన్న భూములను కాపాడుకోవటానికే లోకేశ్‌ను అక్కడ పోటీలో దించి తమ కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశాలీలకు టికెట్ ఇచ్చిన పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నేతలు చినబాబు, రాధాకృష్ణ, ఘంటశాల జగదీశ్, డాక్టర్ శారద, వి నాగరాజు, మురళీకృష్ణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
‘లోకేశ్‌కు బుద్ధి చెబుతాం’
సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీ తమకు ద్రోహం చేసిందని పద్మశాలీలు ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ సీటును తమకు కేటాయించాలని డిమాండ్ చేసింది. ఆంద్రప్రదేశ్ పద్మశాలీ సంఘం ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు కేఏఎన్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ... 13 జిల్లాల్లో సీట్ల కేటాయింపులో తమకు టీడీపీ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. తమతో పల్లకీలు మోయించికుని మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీని భుజాన వేసుకుని మోస్తే ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్‌కు తమ ఓట్లతోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ సంఘంలోని సభ్యులందరితో చర్చించి తీర్మానాలు ప్రకటిస్తామని చెప్పారు. -
చేనేత అభ్యున్నతికి చేయూత
సాక్షి, హైదరాబాద్: నేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలీ సంక్షేమ సంఘం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించడంతోపాటు.. వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని అన్నారు. మారుతున్న కాలా నికి అనుగుణంగా సామాజిక మార్పులు వస్తాయని, ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవిక దృక్పథంతో ముం దుకు పోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చిన పద్మశాలీ సంఘం నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకుని శాశ్వత పరిష్కారాలు చూపాలని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం, రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఇందుకోసం మొదటి విరాళంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పద్మశాలీ సంఘం ప్రముఖులు కూడా సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. జోలె పట్టి.. చందాలు పోగుచేసి.. ‘‘చేనేత వృత్తికి గతంలో గొప్ప గౌరవం దక్కేది. ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకూ ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 130 కోట్ల మంది భారతీయులకు సరిపడా వస్త్రాలను చేనేత కార్మికులు నేయలేరు. మరమగ్గాలు, మిల్లులు వచ్చాయి. వాటితో చేనేత కార్మికులు పోటీ పడటం అసాధ్యం. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వేరే పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. సమైక్య పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు. సమస్యలను పరిష్కరించలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న నేను స్వయంగా పూనుకుని సిరిసిల్లలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.50 లక్షల పార్టీ నిధులతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశా. పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోతే.. టీఆర్ఎస్ పక్షాన జోలె పట్టుకుని చందాలు పోగు చేసి ఆదుకునే ప్రయత్నం చేశాం’’అని వివరించారు. వస్త్రాలు కొని ఆదుకుంటున్నాం.. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చేనేత కార్మికులకు కొంతమేరకైనా ఆదుకోవచ్చని ఆనాడే అనుకున్నాం. రాష్ట్రం వచ్చాక చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. చేనేత, నేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంచే చీరలను, ఇతర ప్రభుత్వ అవసరాలకు వస్త్రాలను సేకరించి, మార్కెటింగ్ సమస్య రాకుండా చేస్తున్నది. వంద శాతం ప్రభుత్వ నిధులతో మరమగ్గాలను ఆధునీకరిస్తున్నాం. నూలు, రసాయలనాలపై 50 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. ఈ చర్యల వల్ల కొంత ఉపశమనం దొరికింది. మరమగ్గాల కార్మికులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ఆదాయం వస్తోంది. ఇదే శాశ్వత పరిష్కారం కాదు. ఇంకా చేనేత వృత్తుల్లోనే కొనసాగుతున్న వారికి, మరమగ్గాలపై పనిచేస్తున్న వారికి కొంత మేరకు ఈ ప్రయత్నాల వల్ల మేలు కలిగింది’’అని కేసీఆర్ తెలిపారు. లెక్కలు తీయాలి.. చేనేత వృత్తిని వదిలేసిన వారిని, వేరే ఉపాధి చూసుకునే వారిని గుర్తించి చేయూత అందించాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. పద్మశాలీ సంఘం ప్రముఖులు, పెద్దలు ఇందుకోసం క్రియాశీలంగా మారాలని కోరారు. ‘‘తమ కులంలో ఎవరు సంప్రదాయ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు? వారికోసం ఏం చేయాలి? అలాగే పోచంపల్లి, గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో కళాత్మక చేనేత వృత్తి కొనసాగుతోంది. అక్కడి వస్త్రాలకు మార్కెట్ ఉంది. అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి? వృత్తిని వదిలిపెట్టిన వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపాలి? వారికి ప్రభుత్వం ఏం చేయాలి? అనే విషయాలపై లెక్కలు తీయాలి. మీకేం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ నిధులను ఉపయోగించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎలా కనుగొంటారనే దానిపై అధ్యయనం చేయాలి’’అని కోరారు. సీఎంతో భేటీ అయిన వారిలో తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మ్యాడం బాబురావు, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, కోశాధికారి అంకం వెంకటేశ్వర్లు, మహిళా ఆర్థిక సహకార సంఘం అధ్యక్షురాలు గుండు సుధారాణి, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఎన్ఆర్ఐ ప్రతినిధి సామల ప్రదీప్, పద్మశాలీ సంఘం నాయకులు జల్ల మార్కండేయ, గుండు ప్రభాకర్, చాగల్ల నరేంద్రనాథ్ ఉన్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, వివేకానంద, అధికారులు వికాస్‌రాజ్, నీతూప్రసాద్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పవర్లూమ్ సమస్యను పరిష్కరించండి
భివండీ, న్యూస్‌లైన్: పవర్ లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును భివండీకి చెందిన పద్మశాలీ సంఘాలు కోరాయి. రాజ్ భవన్లో సోమవారం మధ్యాహ్నం భివండీకి చెందిన పద్మశాలీ సంఘాల సభ్యులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో స్థిరపడిన పద్మశాలీల్లో అధిక శాతం మంది పవర్లూమ్ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన పవర్లూమ్ ప్యాకేజీ కేవలం జైన్, మైనార్టీ, బడుగు కులాల వారికే లబ్ధిచేకూర్చేలా ఉందని, ఎస్బీసీలకు ఏమాత్రం ప్ర యోజనం కలిగించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్బీసీలకు చెందిన పద్మశాలీలకు కూడా ఈ ప్యాకేజీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భివండీలో తెలుగు ప్రజలు స్థిర పడిన ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తెలుగు పాఠశాలలు, ఆశ్రమశాల, కార్మికులకు ప్రత్యేక వైద్యశాలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా విన్నవించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అసంఘట్ పవర్లూమ్ విభాగ చైర్మన్, భివండీ పద్మనగర్ పవర్లూమ్ వివర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ పురుషోత్తం, అఖిల పద్మశాలి సమాజం కార్యాధ్యక్షుడు వేముల నర్సయ్య, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, యెల్లె సాగర్ తదితరులు ఉన్నారు.