విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌ | Minister Anil Kumar Gives Awards To Students In Nellore | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌

Published Sun, Jul 21 2019 5:31 PM | Last Updated on Sun, Jul 21 2019 5:35 PM

Minister Anil Kumar Gives Awards To Students In Nellore - Sakshi

నెల్లూరు : పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన పద్మశాలి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన మంత్రి వారికి పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నగరంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు ముక్కాల ద్వారకనాథ్‌, వైవీ రామిరెడ్డి, సంక్రాంతి కల్యాణ్‌, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, పద్మశాలి నాయకులు అశ్వత్థామ, బాలజీ, దోనుపర్తి గిరిలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement