చికాగోలో సామూహిక వనభోజనాలు | Padmashali Association Celebrations In Chicago | Sakshi
Sakshi News home page

చికాగోలో సామూహిక వనభోజనాలు

Published Tue, Jun 11 2019 1:14 PM | Last Updated on Tue, Jun 11 2019 1:14 PM

Padmashali Association Celebrations In Chicago - Sakshi

చికాగో : నాపా (నార్త్‌ అమెరికా పద్మశాలీ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక వనభోజనాల కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 250 పద్మశాలీ కుటుంబాలు పాల్గొన్నాయని నాపా తెలిపింది. స్వర్గీయ అజయ్‌ మెతుకు(నాపా వ్యవస్థాపకులు)కు నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న అందరూ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ వంటకాలతో అంరదరి నోరూరించారు. చికాగో బృందం పద్మశ్రీ రామారావు (పద్మశాలీ సంఘం మాజీ అధ్యక్షుడు) సత్కరించింది.

ఈ ఈవెంట్‌ను నిర్వహించిన చికాగో చాప్టర్‌ డైరెక్టర్‌ రాజ్‌ అడ్డగట్ల, బోర్డ్‌ సభ్యులు ఈశ్వర్‌ గుమిడ్యాల, వేణు పిస్కా, ట్రెజరర్‌ రామ్‌రాజ్‌ అవదూత.. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను సత్కరించారు. టీమ్‌ సభ్యులు రాజ్‌ గెంట్యాల, శ్రీమాన్‌ వంగరి, రవి కూరపాటి, శ్రీనివాస్‌ దామర్ల, విమల్‌ దాసి, శ్రీనివాస్‌ కైరంకొండ,  సాయిరామ్‌ పసికంతి, ప్రవీణ్‌ కటకం, శ్రీనివాస్‌ వేముల సహాకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని నాపా తెలిపింది. 2019 సెప్టెంబర్‌ 14న జరిగే వార్షికోత్సవానికి హాజరు కావల్సిందిగా కార్యక్రమానికి పాల్గొన్నవారందరినీ కోరారు.  ఈ కార్యక్రమానికి నాపా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సంతోష్‌ అంకెం, దేవాంగ్‌ అసోసియేషన్‌ ఫౌండర్‌ వెంకటేశ్వర్‌ రావు బట్చు, రవి బోధులా హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement