ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయవల్సిందిగా ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు తొలగించుకున్నామని డీజీపీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇంటి నిర్మాణం కూడా అక్రమమే అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.