రూ. 5 భోజనం ఎలాగుంది? | Mla Alla Ramakrishana Reddy eating 5 rupees Meals | Sakshi
Sakshi News home page

రూ. 5 భోజనం ఎలాగుంది?

Published Thu, Apr 13 2017 12:44 AM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM

రూ. 5 భోజనం ఎలాగుంది? - Sakshi

రూ. 5 భోజనం ఎలాగుంది?

జీహెచ్‌ఎంసీ భోజన కౌంటర్‌లో తిన్న  ఎమ్మెల్యే ఆర్కే
హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న రూ. 5ల భోజన కేంద్రం (అన్నపూర్ణ) వద్దకు ఓ వ్యక్తి బైక్‌పై వచ్చారు. చేతిలో హెల్మెట్‌తో క్యూలో నిలబడి, టోకెన్‌ తీసుకొని, వారందించిన భోజనం చేశారు.

 ఇంతకీ ఆయన ఎవరంటే మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). ఆయనను గుర్తుపట్టిన మీడియా ప్రతినిధులు మీరేంటి.. ఇలా? అని ఆరా తీయగా.. ఇలాంటి పథకాన్ని తన నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆర్కే తెలిపారు. అందుకే రూ. 5 భోజనం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇలా వచ్చానని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement