TRS party office
-
పాలమూరుకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరుకు రానున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో వచ్చి బస్టాండు సమీపంలో నిర్మించిన జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పాలకొండ వద్ద రూ.52 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు మహబూబ్‌నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిది ద్దారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, తోరణాలే కనిపిస్తున్నాయి. బహిరంగ సభ కోసం మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా జనసమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. సీఎం ప్రసంగాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభ తర్వాత కేసీఆర్ సాయంత్రం హెలికాప్టర్లో తిరుగు పయనమవుతారు. -
హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 4,935 చదరపు గజాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం/గ్రామం, ఎన్బీటీ నగర్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.12 వద్ద సర్వే నంబర్ 18/పీ, 21/పీలో ఈ స్థలం ఉంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరను ఖరారు చేసే ప్రక్రియను పెండింగ్‌లో ఉంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం సదరు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఈ నెల 9న ప్రతిపాదనలు పంపగా 10న సీసీఎల్ఏ ఆమోదముద్ర వేసింది. స్థలం విలువ దాదాపు రూ.70 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి శంకు స్థాపన, భూమిపూజ సహా ఇతర కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు సీఎం కేసీఆర్ బుధవారం మూడు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. బేగంపేట విమానా శ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం కోసం కేంద్రం కేటాయించిన 1,100 చదరపు మీటర్ల స్థలంలో సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30కు కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకుం టున్న అతికొన్ని ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్ చేరుతోంది. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేత లను ప్రారం భోత్సవానికి ఆహ్వానించాలనే యోచ నలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. షెఖావత్, అమిత్ షా, నిర్మలతో భేటీలు? ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. అయితే ప్రధాని మోదీతో సీఎం భేటీకి సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ మంగళవారం ఖరారవుతుందని సమా చారం. రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై ప్రజాభి ప్రాయ సేకరణ జరిగిన నేపథ్యంలో కేంద్ర జలవన రుల శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్‌తో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రా నికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం సమావేశం కావొచ్చని సమాచారం. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రూ. 40 కోట్లతో నిర్మాణం... రూ.40 కోట్ల అంచనాతో నిర్మించే ఢిల్లీ టీఆర్ఎస్ భవన్లో సమావేశ మందిరం, రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారికి బస తదితర సదుపాయాలు ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ను పోలి ఉండేలా ఢిల్లీ టీఆర్ఎస్ భవన్ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన చేయాలని కేసీఆర్ భావించినా కరోనా రెండో దశ విజృంభణ, లాక్డౌన్ పరిస్థితుల్లో కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గతంలో పార్టీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి కార్యాలయ భవన డిజైన్లపై చర్చించారు. -
గజం వందనే..!
సాక్షి,ఆదిలాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం అప్పట్లో రెవన్యూ అధికారులు నిర్ధారించిన ధర కోట్ల నుంచి లక్షల రూపాయలకు దిగొచ్చింది. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్నీ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ కారణంగా ఈ ధర దిగి వచ్చింది. ఎకరంలోపు.. అధికార పార్టీ టీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో సొంత పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని గతేడాదే నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసి కనీసం ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలని గతేడాది పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇందుకు అనుగుణంగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జీఓ నెం.571 ప్రకారం ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. గుర్తించిన భూమి... ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోకి వచ్చే సర్వే నెం.346లో 36 గుంటల స్థలాన్ని గుర్తించారు. ఇది ఎకరానికి నాలుగు గుంటల స్థలం తక్కువగా ఉంది. పట్టణంలోని గాంధీ పార్కు, పాలశీతలీకరణ కేంద్రానికి ఎదురుగా కైలాస్‌నగర్‌లో వైట్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. ఇది వరకు ఈ స్థలంలో దూరదర్శన్ రిలే కేంద్రం ఈ స్థలంలో ఉండేది. ప్రస్తుతం న్యాక్ శిక్షణ కేంద్రం కొనసాగుతోంది. శిథిలావస్థలో చిన్న భవనం మాత్రమే ఉంది. దీనిని ఆనుకొని వైట్ క్వార్టర్స్ ఉన్న స్థలం కలుపుకొని మొత్తం 36 గుంటల స్థలాన్ని గతేడాది గుర్తించారు. జెడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయం తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ఇదే దారిలో కడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, న్యాయమూర్తుల క్వార్టర్స్, డీఆర్వో, ఇతరత్ర ముఖ్యమైన ఉన్నతాధికారుల భవనాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పార్టీ కార్యాలయం కోసం అనువుగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఈ స్థలాన్ని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డిలు ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో ఆదిలాబాద్‌అర్బన్ తహసీల్దార్ నుంచి ఆర్డీఓ ద్వారా కలెక్టర్ కార్యాలయానికి దీనికి సంబంధించిన పత్రాలను పంపించారు. కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకు వెళ్లిన ఫైల్ చివరిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి కేటాయింపు జరిగింది. అప్పట్లో ధర వివాదం.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గుర్తించిన స్థలం కేటాయింపునకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం 2018లో ప్రభుత్వానికి పంపించిన ఓపెన్ మార్కెట్ ధర అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పట్లో గుంటకు రూ.10లక్షల చొప్పున మొత్తం 36గుంటలకు రూ.3.65 కోట్లు నిర్ధారించి పంపడం వివాదానికి కారణమైంది. ధర విషయంలో రెవెన్యూ అధికారులపై టీఆర్ఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. అయితే ప్రభుత్వ బేసిక్ విలువపై ఎన్నో స్థాయిల రెట్టింపులో ఈ ధరను నిర్ధారించినట్లు పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అంత ధరనా.. అని టీఆర్ఎస్ ముఖ్యనేతలు రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో ముఖ్యమైన కూడలిలోని ఈ స్థలం అంశం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో జేసీగా ఉన్న కృష్ణారెడ్డి బదిలీ అయ్యే ముందు ధర విషయంలో ఓపెన్ మార్కెట్ ధరను ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఈ వివాదానికి అప్పట్లో కారణమైంది. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయిన విషయం విధితమే. తాజాగా ఉత్తర్వులు.. జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఒక్కో ఎకరం చొప్పున స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్ తివారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పాలసీ తీసుకొచ్చింది. దాని ప్రకారం తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 36 గుంటల స్థలాన్ని రూ.4,35,600 లకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. నేడు భూమిపూజ.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గుర్తించిన స్థలంలో సోమవారం భూమిపూజ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు కేటాయించిన స్థలంలో భూమిపూజ జరగనుండడం విశేషం. ఆదిలాబాద్‌లో జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డిలతో పాటు ఇటీవల ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. -
ఇక ఢిల్లీలోనూ టీఆర్ఎస్ భవన్
న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో భాగంగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని అన్వేషించడం కోసం శుక్రవారం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కొన్ని ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారని తెలిసింది. నిబంధనల ప్రకారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కేటాయించే అవకాశం ఉంది. శుక్రవారం కార్యాలయ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం సంక్రాంతి పండుగ తర్వాత ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని.. రెండు, మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. -
రూ. 5 భోజనం ఎలాగుంది?
జీహెచ్ఎంసీ భోజన కౌంటర్లో తిన్న ఎమ్మెల్యే ఆర్కే హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న రూ. 5ల భోజన కేంద్రం (అన్నపూర్ణ) వద్దకు ఓ వ్యక్తి బైక్‌పై వచ్చారు. చేతిలో హెల్మెట్‌తో క్యూలో నిలబడి, టోకెన్ తీసుకొని, వారందించిన భోజనం చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). ఆయనను గుర్తుపట్టిన మీడియా ప్రతినిధులు మీరేంటి.. ఇలా? అని ఆరా తీయగా.. ఇలాంటి పథకాన్ని తన నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆర్కే తెలిపారు. అందుకే రూ. 5 భోజనం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇలా వచ్చానని బదులిచ్చారు. -
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలా అసెంబ్లీ
అసెంబ్లీని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలా నడుపుతున్నారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటల పాటు పచ్చి అబద్ధాలతో ఏకపాత్రాభినయం చేస్తుంటే, వారి సభ్యులు బల్లలు చరుస్తూ భజన చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత అవమానకరంగా, హేయమైన రీతిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో విపక్ష సభ్యుల వివరణ తీసుకోకుండా అవమాన పరిచారు. కేవలం వారి మిత్రపక్షమైన ఎంఐఎంతో ముగించారు. సభలో అసభ్య పదజాలం వాడుతున్నా స్పీకర్ చూస్తూ ఊరుకోవడం సమంజసం కాదు. - రేవంత్‌రెడ్డి, టీడీపీ -
అధికార పీఠం టీఆర్ఎస్దే
జహీరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ర్టంలో అధికార పీఠంపై కూర్చునేది టీఆర్ఎస్ పార్టీయేనని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి భీంరావు బసంత్‌రావు పాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థి కె.మాణిక్‌రావులు ధీమా వ్యక్తం చేశారు. గురువారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమగు స్థానాలను టీఆర్ఎస్ సాధించనుందని పేర్కొన్నా రు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిం చిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. గత 14 ఏళ్లుగా పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు చేపట్టి ఉద్యమం మూలంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కెసీఆర్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ సరళి పూర్తిగా టీఆర్ఎస్కు అనుకూలంగా సాగిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్కు సంపూర్ణంగా వద్దతు పలికినందున తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు అధికారానికి అవసరమైన స్థానాలు లభించనున్నాయన్నారు. ఎవరి మద్దతు లేకుండా తమ పార్టీ ఒంటరిగానే అధికారాన్ని చేపట్టనుందన్నారు. ప్రజలంతా కె.చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ఆయనే సీఎం అని పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన కేసీఆర్‌తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందన్నారు. ఆయన హయాం లోనే అన్ని వర్గాల ప్రజలకు తగిన మేలు జరుగుతుందన్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానంతోపాటు పార్లమెం ట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను సైతం టీఆర్ఎస్ గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. జహీరాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు గాను తమ వంతు పాటు పడతామన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి గాను తగిన చర్య లు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో తమ గెలుపు కోసం పని చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, సినీ నిర్మాత ఎం.శివకుమార్, మాజీ ఎమ్మె ల్యే సి.బాగన్న, నాయకులు పి.నర్సిం హారెడ్డి, మురళికృష్ణాగౌడ్, జి.విజయకుమార్, మాణిక్యమ్మ, ఎం.పాండురంగారెడ్డి, గౌని శివకుమార్, నామ రవికిరణ్‌గుప్తా, ఎం.డి.యాకూబ్, అలీ అక్బర్, మొయిజొద్దీన్, గోరేమియా సికిందర్, మోతిరాం, బండిమోహన్, కలీం, శశికాంత్‌లు పాల్గొన్నారు. -
వికారాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయానికి గత అర్థరాత్రి దుండగులు నిప్పు అంటించారు. ఆ ఘటనలో కార్యాలయంలోని సామాగ్రి అంతా దగ్ధమైంది. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు ఆ దారుణానికి ఒడిగట్టారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. నేతల ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.