న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో భాగంగా ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని అన్వేషించడం కోసం శుక్రవారం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కొన్ని ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారని తెలిసింది.
నిబంధనల ప్రకారం ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కేటాయించే అవకాశం ఉంది. శుక్రవారం కార్యాలయ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం సంక్రాంతి పండుగ తర్వాత ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని.. రెండు, మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment