సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అంబేడ్కర్ జపం చేయకపోతే పుట్టగతులు ఉండవని గ్రహించడం వల్లే కేసీఆర్ కొత్తగా అంబేడ్కర్ నామ స్మరణ మొదలుపెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు, విగ్రహం ఏర్పాటు సంతోషమేనని.. కానీ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారికి న్యాయం చేసేది ఎప్పుడని ప్రశ్నించారు. శుక్రవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణభవన్‌లోని ఈటల, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, రిజర్వేషన్లు ఇలా ఏ ఒక్కహామీ అమలు కాలేదని.. దళితుల కళ్లలో కేసీఆర్ మట్టి కొట్టారని మండిపడ్డారు.
దళితుల భూములను లాక్కుంటున్నారు..
కేసీఆర్ పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవున్నాయని ఈటల వ్యాఖ్యానించారు. దళిత సీఎం హామీ ఇచ్చి మాట తప్పడం తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉల్లంఘన అని.. కేబినెట్‌లో ఉన్న దళిత ఉప ముఖ్యమంత్రిని సాకులు చెప్పి తీసేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మండిపడ్డారు.గత ప్రభుత్వాలు దళితులకు ఇచి్చన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. మహనీయుడి విగ్రహం పెట్టినంత మాత్రాన ఎవరూ కేసీఆర్‌కు జేజేలు కొట్టబోరని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment