
టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలా అసెంబ్లీ
అసెంబ్లీని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలా నడుపుతున్నారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటల పాటు పచ్చి అబద్ధాలతో ఏకపాత్రాభినయం చేస్తుంటే, వారి సభ్యులు బల్లలు చరుస్తూ భజన చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత అవమానకరంగా, హేయమైన రీతిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో విపక్ష సభ్యుల వివరణ తీసుకోకుండా అవమాన పరిచారు. కేవలం వారి మిత్రపక్షమైన ఎంఐఎంతో ముగించారు. సభలో అసభ్య పదజాలం వాడుతున్నా స్పీకర్ చూస్తూ ఊరుకోవడం సమంజసం కాదు.
- రేవంత్‌రెడ్డి, టీడీపీ