అధికార పీఠం టీఆర్‌ఎస్‌దే
జహీరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ర్టంలో అధికార పీఠంపై కూర్చునేది టీఆర్‌ఎస్ పార్టీయేనని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి భీంరావు బసంత్‌రావు పాటిల్, ఎమ్మెల్యే అభ్యర్థి కె.మాణిక్‌రావులు ధీమా వ్యక్తం చేశారు. గురువారం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమగు స్థానాలను టీఆర్‌ఎస్ సాధించనుందని పేర్కొన్నా రు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిం చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. గత 14 ఏళ్లుగా పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు చేపట్టి ఉద్యమం మూలంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణం కెసీఆర్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ సరళి పూర్తిగా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా సాగిందన్నారు.
ప్రజలు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణంగా వద్దతు పలికినందున తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు అధికారానికి అవసరమైన స్థానాలు లభించనున్నాయన్నారు. ఎవరి మద్దతు లేకుండా తమ పార్టీ ఒంటరిగానే అధికారాన్ని చేపట్టనుందన్నారు. ప్రజలంతా కె.చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ఆయనే సీఎం అని పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన కేసీఆర్‌తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందన్నారు. ఆయన హయాం లోనే అన్ని వర్గాల ప్రజలకు తగిన మేలు జరుగుతుందన్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానంతోపాటు పార్లమెం ట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను సైతం టీఆర్‌ఎస్ గెలుపొందుతుందని జోస్యం చెప్పారు.
జహీరాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు గాను తమ వంతు పాటు పడతామన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి గాను తగిన చర్య లు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో తమ గెలుపు కోసం పని చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, సినీ నిర్మాత ఎం.శివకుమార్, మాజీ ఎమ్మె ల్యే సి.బాగన్న, నాయకులు పి.నర్సిం హారెడ్డి, మురళికృష్ణాగౌడ్, జి.విజయకుమార్, మాణిక్యమ్మ, ఎం.పాండురంగారెడ్డి, గౌని శివకుమార్, నామ రవికిరణ్‌గుప్తా, ఎం.డి.యాకూబ్, అలీ అక్బర్, మొయిజొద్దీన్, గోరేమియా సికిందర్, మోతిరాం, బండిమోహన్, కలీం, శశికాంత్‌లు పాల్గొన్నారు.