Rs. 5 meals
-
రూ. 5 భోజనం ఎలాగుంది?
జీహెచ్ఎంసీ భోజన కౌంటర్లో తిన్న ఎమ్మెల్యే ఆర్కే హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న రూ. 5ల భోజన కేంద్రం (అన్నపూర్ణ) వద్దకు ఓ వ్యక్తి బైక్‌పై వచ్చారు. చేతిలో హెల్మెట్‌తో క్యూలో నిలబడి, టోకెన్ తీసుకొని, వారందించిన భోజనం చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). ఆయనను గుర్తుపట్టిన మీడియా ప్రతినిధులు మీరేంటి.. ఇలా? అని ఆరా తీయగా.. ఇలాంటి పథకాన్ని తన నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆర్కే తెలిపారు. అందుకే రూ. 5 భోజనం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇలా వచ్చానని బదులిచ్చారు. -
రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బాగ్‌లింగంపల్లి, రామ్‌నగర్‌లో రూ. 5 కే భోజన పథకాన్ని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ... రూ. 5కే భోజనం అందిస్తున్న కేంద్రాల సంఖ్య నగరంలో 35కు చేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాయిని, ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌తోపాటు హరేకృష్ణ ఫౌండేషన్‌కు చెందిన స్వామి పాల్గొన్నారు. రూ. 5కే భోజనాన్ని జీహెచ్ఎంసీ. హరేకృష్ణ ఫౌండేషన్ సంయుక్తం అందిస్తున్న సంగతి తెలిసిందే.