
అక్షయపాత్ర భవనంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ్జ మంత్రి చెరుకువాడ తదితరులు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో తెనాలి రోడ్డులో అక్షయపాత్ర వంటశాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు భోజనం అందిస్తున్న నేపథ్యంలో అధునాతమైన సాంకేతికతతో ఒకేసారి వేలాదిమందికి భోజనం వండేలా ఏర్పాటు చేసిన వంటగదుల భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, కొలనుకొండ వద్ద జాతీయరహదారి పక్కన ఇస్కాన్ నిర్మించనున్న ఆలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.