
ఉండి (పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రజలంతా అన్ని విధాల అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన స్వగ్రామం ఉండి మండలం యండగండిలో సోమవారం 21 మంది అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గోగులమండ చినకృష్ణకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇంటి పట్టాలను పంపిణీచేశారు.
ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలిచి వారి కలలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనకు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన జగన్‌మోహన్‌రెడ్డికి ముందు ఆ తరువాత అన్నట్లుగా మారిపోయిందని అన్నారు. సొంత ఇల్లు లేని ప్రజలను గమనించి ఎంత ఖర్చయినా ఇంటి స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. జగనన్న లేఅవుట్లలో రోడ్లు, విద్యుత్, నీరు, తక్కువ ధరకే మెటీరియల్ వంటి సదుపాయాలు కల్పించి ప్రజాభివృద్ధి కోసం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment