Cherukuwada Sri Ranganatha Raju
-
రాష్ట్రాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం
ఉండి (పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రజలంతా అన్ని విధాల అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన స్వగ్రామం ఉండి మండలం యండగండిలో సోమవారం 21 మంది అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గోగులమండ చినకృష్ణకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇంటి పట్టాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలిచి వారి కలలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనకు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన జగన్మోహన్రెడ్డికి ముందు ఆ తరువాత అన్నట్లుగా మారిపోయిందని అన్నారు. సొంత ఇల్లు లేని ప్రజలను గమనించి ఎంత ఖర్చయినా ఇంటి స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. జగనన్న లేఅవుట్లలో రోడ్లు, విద్యుత్, నీరు, తక్కువ ధరకే మెటీరియల్ వంటి సదుపాయాలు కల్పించి ప్రజాభివృద్ధి కోసం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి అని అన్నారు. -
అక్షయపాత్ర వంటశాలను ప్రారంభించనున్న సీఎం జగన్
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో తెనాలి రోడ్డులో అక్షయపాత్ర వంటశాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు భోజనం అందిస్తున్న నేపథ్యంలో అధునాతమైన సాంకేతికతతో ఒకేసారి వేలాదిమందికి భోజనం వండేలా ఏర్పాటు చేసిన వంటగదుల భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, కొలనుకొండ వద్ద జాతీయరహదారి పక్కన ఇస్కాన్ నిర్మించనున్న ఆలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. -
ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి: శ్రీరంగనాథరాజు
సాక్షి, పశ్చిమగోదావరి: ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. 4 లక్షల కోట్ల ఆస్తిని పేదలకు సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. చదవండి: డాక్టర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా.. ఓటీఎస్‌పై కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 4 వేల కోట్లు లబ్ధిదారులు చెల్లించడం ద్వారా పేదలకు 10 వేల కోట్ల రుణ మాఫీ జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రుణ భారంలో ఉన్న పేద వారికి రుణ విముక్తి కలిగించి ఓటీఎస్‌తో వారి ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్నారన్నారు. రుణం లేనివారి దగ్గర 10 రూపాయల నామమాత్రపు రుసుంతో రిజిస్ట్రేషన్ పట్టా అందిస్తున్నామని’’ శ్రీరంగనాథరాజు అన్నారు. -
మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నాం: శ్రీరంగనాథరాజు
సాక్షి, అనంతపురం: పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు విమర్శలు అర్థరహితమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నామన్నారు. ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని వెల్లడించారు. లే ఔట్ల వద్దే లబ్ధిదారులకు ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పదేపదే అడ్డుపడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వచ్చే రెండేళ్లలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని, అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి హితవు పలికారు. -
నేను రైతులను కించపరచలేదు: మంత్రి రంగనాథరాజు
సాక్షి, తిరుపతి : తాను రైతులను కించపరచలేదని, కౌలు రైతుల వరకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని మంత్రి రంగనాథరాజు అన్నారు. తానూ ఓ రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తెలిసినవాడినేనని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా మాటల వల్ల ఎవరైనా బాధ పడితే క్షమించండి. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని అన్నారు. -
అర్బన్‌లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం
సాక్షి, అమరావతి: పంచాయతీ పోరులో ప్రజలు వైఎస్సార్సీపీ మద్దతుదారులకు జై కొట్టారని, పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ఖాయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో సేవా గుణం, ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిత్వం ఉన్న వారినే అభ్యర్థులుగా పోటీకి నిలపాలని ఆయన సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ గెలిచి తీరుతుందన్నారు. గుంటూరు జిల్లా నేతలు సమష్టిగా పని చేసి ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. సమీక్షలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలిలో ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, ముస్తఫా, విడదల రజిని, అన్నాబత్తుని శివకుమార్, మద్దాళి గిరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉనికి కోల్పోతామన్న భయంతోనే రాష్ట్రంలో ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత నిప్పులు చెరిగారు. ఆదివారం ఆమె గుంటూరు జిల్లా పేరేచర్లలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అశాంతి సృష్టించేందుకు ప్రతిపక్షం చేస్తున్న పనులు దురదృష్టకరమన్నారు. ‘‘ఇంత పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నది ఒక్క జగన్ ప్రభుత్వమే. గుడిసెలు లేని రాష్ట్రం కావాలన్నదే మహానేత దివంగత వైఎస్సార్ ఆలోచన. పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ దేశంలో చరిత్రగా నిలిచిపోతుంది. ప్రతి మహిళను లక్షాధికారి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. ఆయన గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. భూములు కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని’’ సుచరిత పేర్కొన్నారు. (చదవండి: లోకేష్‌ను హెచ్చరించిన మంత్రి కొడాలి) కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ: శ్రీరంగనాథరాజు కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ పేరేచర్లలో ఏర్పాటు చేశామన్నారు. పేరేచర్లలో 18,482 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిపక్ష నేత కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతారని ధ్వజమెత్తారు. పేరేచర్ల లేఅవుట్‌ను మోడల్ లేఆవుట్గా తీర్చిదిద్దుతామని, రూ.7 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు.(చదవండి: రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు) ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదు: మోపిదేవి నవరత్నాల్లో ప్రధానమైన పథకం ఇళ్ల పట్టాల పంపిణీ అని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలను వైఎస్ జగన్ చూశారని, ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నదే ఆయన ఆలోచన అని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాల ద్వారా ఆస్తి హక్కు కల్పిస్తున్నామని, ఏడాదిన్నర కాలంలోనే అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు.. కులమతాల పేరుతో గొడవ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదని మోపిదేవి ధ్వజమెత్తారు. -
‘అమరావతి ఉద్యమం ఒక ఫేక్’
సాక్షి, గుంటూరు: చిలకలూరిపేటలో రూ.46 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. గడియార స్తంభం వద్ద మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, విడదల రజిని పాల్గొన్నారు. ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు: బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. అనుకూల మీడియాతో చంద్రబాబు.. పథకం ప్రకారం బురదచల్లుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా సీఎం జగన్ ప్రజలను ఆదుకున్నారని, గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. ఆరోగ్య ప్రదాతగా నిలిచారు: శ్రీరంగనాథ రాజు ఈనెల 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని 2400 జబ్బులను ఆరోగ్యశ్రీ లో చేర్చి సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య ప్రదాత అనిపించుకున్నారని తెలిపారు. అమరావతి ఉద్యమం ఒక ఫేక్: అంబటి రాంబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు దొడ్డిదారిన లోకేష్‌ను మంత్రిని చేశారని మండిపడ్డారు. లోకేష్‌ను ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు గెలిపించుకోలేక పోయారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేయిస్తున్న అమరావతి ఉద్యమం ఒక ఫేక్ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. -
రఘురామకృష్ణంరాజుపై మంత్రి ఫిర్యాదు
సాక్షి, పశ్చిమ గోదావరి: తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. నిజాయితీ పరుడిగా, సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో తాను సంపాదించుకున్న మంచి పేరును చెడగొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తనపై ఆరోపణలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై శ్రీరంగనాథ రాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.(‘మనసా, వాచా ఆయన వైఎస్సార్సీపీతో లేరు’) ఈ నేపథ్యంలో శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు తనను, తన కుమారుడిని వ్యక్తిగతంగా దూషించడం సహా దొంగలు అని సంబోధించారంటూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తాను, తోటి ఎమ్మెల్యేలు, మరో మంత్రి పేర్ని నానితో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడిన విషయాన్ని ఉదాహరిస్తూ.. "పందులే గుంపులుగా వస్తాయి" అని వ్యాఖ్యానించటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘రాజకీయ, ప్రజా జీవితంలో విమర్శలు సహజం. కానీ ఒక అవకాశవాది తన వ్యక్తిగత, స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటి వారి వ్యక్తిత్వంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదలుచుకోలేదు. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మద్దతుదారులు నా దిష్టిబొమ్మలు తగలబెట్టి వర్గ వైషమ్యాలు సృష్టించి శాంతి భద్రతలకు అవరోధం కలిగించారు. అదే విధంగా పదే పదే మీడియా ముందు, న్యూస్ డిబేట్లలో, సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. అయినా పది సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. కానీ అబద్దం చెప్పిన వ్యక్తిపై ఏ చర్య తీసుకోకపోతే అది సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ వివాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని భావించాను. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా.. చట్టాలను గౌరవించే వ్యక్తిగా.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో.. న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను’’అని మంత్రి పేర్కొన్నారు. -
వారికి త్వరలో పదవులు: శ్రీ రంగనాథరాజు
సాక్షి, పశ్చిమగోదావరి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సేవలు రైతులకు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. శనివారం ఆయన ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు వ్యవస్థ లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు చేయాన్నలదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశమని పేర్కొన్నారు. (రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్) భరోసా కేంద్రాల ద్వారా పంటలకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తారన్నారు. కేంద్రాల ద్వారా నేరుగా రైతులకు ఎరువులు, పురుగు మందులు అందిస్తామని తెలిపారు. దళారులతో మోసపోవద్దని.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని.. వారికి త్వరలోనే పదవులు కూడా ఇస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు వెల్లడించారు. (జ(గ)న్ రంజక పాలనకు ఏడాది) -
పక్కా పథకం ప్రకారమే తేజస్వినిపై దాడి
సాక్షి, ఏలూరు: ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్మాది దాడిలో గాయపడి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవ్వూరి తేజస్వినిని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా పోడూరు మండలం కవిటంకు చెందిన డిగ్రీ విద్యార్థిని తేజస్వినిని పథకం ప్రకారమే మేడపాటి సుధాకర్‌రెడ్డి హతమార్చేందుకు కత్తితో దాడికి పాల్పడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తేజస్వినిని ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తుండటంతో ఆమె కుటుంబసభ్యులకు విషయాన్ని తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు విషయాన్ని గ్రామ పెద్దలు దృష్టికి తీసుకు వెళ్లడంతో తేజస్వినిని ఇబ్బంది పెట్టనని సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఈ ఘటనతో తేజస్వినిపై కక్ష పెంచుకున్న సుధాకర్‌రెడ్డి ఆమెను హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేశాడు. సమయం కోసం మాటువేసి కత్తితో ఆమెపై దాడి చేశాడు. తేజస్విని పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పెద్దల సమక్షంలో రాజీ జరిగినప్పట్నుంచీ కళాశాలకు వెళ్లేటపుడు రోజూ ఆమె మేనమామ శ్రీనివాసరెడ్డి బస్సు ఎక్కించి వస్తున్నారు. అయితే బుధవారం పని ఉండి మేనమామ ఆమె వెంట రాలేదు. తేజస్విని ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టిన సుధాకర్‌రెడ్డి వెస్పాపై కత్తులు ఉన్న సంచి తీసుకుని ఆమెను వెంబడించాడు. కత్తితో దాడికి తెగబడ్డాడు. సమీపంలోని ఇంటి పెరట్లోకి తేజస్విని పరుగెత్తడంతో అక్కడే ఉన్న ఆ ఇంటి యజమానితో పాటు మరొకరు సుధాకర్‌రెడ్డిని అడ్డుకున్నారు. ఓవైపు వారిని విదిలించుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తేజస్వినిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాడి తరువాత సుధాకర్‌రెడ్డి నోటి నుంచి నురుగ రావడంతో దాడి చేయడానికి ముందే అతడు పురుగుమందు తాగినట్లు తెలుసతఓంది.. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరినీ చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం తేజస్విని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా సుధాకర్‌రెడ్డికి గతంలోనే వివాహం అయింది. అయినా తేజస్వినిని ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. -
హామీలు నెరవేర్చిన ఘనత జగన్‌దే
సాక్షి, పెనుగొండ(పశ్చిమగోదావరి) : ఎన్నికల్లోనూ, ప్రజాసంకల్పయాత్రలోనూ ఇచ్చిన హామీలు, సమయపాలన, సమన్యాయంతో నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం తూర్పుపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు, ఆయా గ్రామాల సమస్యలు సావదానంగా ఆలకించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అ«ధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు మంత్రి శ్రీరంగనాథరాజును కలిసి సమస్యలు విన్నవించుకుని ఘనంగా సత్కరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పూర్తిగా ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలోనూ శిథిలమైన ఎస్సీ కమ్యూనిటీ భవనాలను రిపేర్లు చేయాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, దళిత కాలనీల్లో రహదారి, డ్రెయినేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బ్యాక్‌ల్యాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అంబేడ్కర్ విగ్రహాలను కూల్చిన వారిపై ప్రత్యేక చట్టం రూపొందించి వారిని కఠినంగా శిక్షంచాలని కోరారు. మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ అర్హులై ప్రతి ఒక్కరికీ కులమత, వర్గాలు, పార్టీలకు అతీతంగా అందించడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామాల్లో మంచినీటి చెరువులు శుభ్రం చేసి స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ చేయడానికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ మండల కన్వీనర్లు దంపనబోయిన బాబూరావు, కర్రివేణుబాబు, రుద్రరాజు శివాజీరాజు, పార్టీ నాయకులు గుంటూరి పెద్దిరాజు, చేకూరి సూరిబాబు, మేడిచర్ల పండు, కర్రి గౌరీ సుభాషిణి, బొక్కా అరుణ, ముప్పాళ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
మంత్రి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సీర్సీపీలోకి చేరారు. ఆదివారం నాటి చేరికల అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాత, కొత్త నాయకులు సమిష్టిగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదిన్నర వేల కోట్లతో విజ్జేశ్వరం నుంచి డెల్టా ప్రాంతంలోని అన్ని గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. కాగా కౌలు రైతులకు కూడా రాబోయే రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతు భరోసా కల్పిస్తామని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు చిత్తశుద్ధిగా కృషి చేసి విజయకేతనం ఎగురవేయాలని వ్యాఖ్యానించారు. కళాకారులకు ప్రత్యేక ఫించన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ పివిఎల్ నరసింహరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్ రాజు, మంతెన యోగేంద్ర బాబు, మంతెన సుబ్రమణ్యం రాజు, మంతెన రంగరాజు, మేడిద జాన్సన్ పాల్గొన్నారు. -
వంతెనల నిర్మాణాలకు సీఎం గ్రీన్ సిగ్నల్
సాక్షి, పి.గన్నవరం(తూర్పుగోదావరి) : ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తున్న లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట, వైనతేయ నదీపాయలపై పుచ్చల్లంక–అయోధ్యలంక, ఆనగర్లంక–యర్రంశెట్టి వారిపాలెం వంతెనల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఇటీవల జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ భాస్కర కుమార్, డీఈఎంఎస్ నాగవర్మలు శుక్రవారం ఈ వంతెనల నిర్మాణ ప్రాంతాలను శుక్రవారం బోట్లపై వెళ్లి పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వం పుచ్చల్లంక, ఆనగర్లంక వంతెనలకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి గాలికి వదిలేసింది. ఈ వంతెనల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పి.గన్నవరం మండలం మొండెపులంక సరిహద్దులో ఉన్న పశ్చిమ జిల్లా పుచ్చల్లంక నుంచి అయోధ్యలంక వంతెనకు రూ.50 కోట్ల వ్యయంతో గత టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసి, అనంతరం విస్మరించింది. ప్రస్తుత నిర్మాణ వ్యయం రూ.70 కోట్లకు పెరిగింది. అలాగే టీడీపీ ప్రభుత్వం వదిలేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఆనగర్లంక నుంచి పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం వంతెన నిర్మాణానికి కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంతెన నిర్మాణ ప్రాంతాల పరిశీలన కార్యక్రమంలో మంత్రి తనయుడు చెరుకువాడ నర్సింహరాజు (నరేష్‌రాజు), వైఎస్సార్ సీపీ నాయకులు సుంకర సీతారామ్, కె.సత్యనారాయణ, ఎం.రాంబాబు, జి.బాలకృష్ణ, వై.ప్రసాద్, ఆర్.చంటి, పీఆర్ అధికారులు పాల్గొన్నారు. -
పోటీ పరీక్షలకు మంచి శిక్షణ ఇస్తాం : మంత్రి
సాక్షి, అమరావతి : అమరావతిలోని సచివాలయం 4వ బ్లాక్‌లో పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి స్టడీ సెంటర్స్ ఫైల్‌పై మంత్రి సంతకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రీతి పాత్రమైన శాఖను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 'మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పని చేస్తాను. గత ప్రభుత్వం కేటాయించిన నిధులలో 10శాతం కూడా ఖర్చు చేయలేదు. దళితుల సంక్షేమం ఎస్సీ కార్పొరేషన్ కోసం కేటాయించిన వెయ్యి కోట్లలో 185కోట్లే ఖర్చు చేశారు. సోషల్ వెల్ఫేర్‌కి బడ్జెట్లో 4500కోట్లు కేటాయిస్తే 2600కోట్లు వెనక్కు వచ్చాయి. 8జిల్లాలలో స్టడీ సెంటర్స్ అందించే ఫైల్ మీద తొలి సంతకం చేశాను. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా మంచి శిక్షణ ఇస్తాం' అని తెలిపారు. మరోవైపు బుధవారం పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజ కార్యక్రమాలు నిర్వహించి ఛాంబర్లో అడుగు పెట్టారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. నవ రత్నాలలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణంకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 175 నియోజక వర్గాలలో 100శాతం ఇళ్ళ నిర్మాణము పూర్తి చేస్తామన్నారు. ఉగాది నుంచి ప్రారంభించి దశల వారీగా 25లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. శంకర నారాయణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 80వేల మంది నాయి బ్రాహ్మణులు, రజకులు 2.10 లక్షల మందికి 10వేల చొప్పున సాయం అందించేందుకు ప్రతిపాదనలపై తొలి సంతకం చేశారు. 'ఏపీలో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నవరత్నాలలో కూడా బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు' అని శంకర నారాయణ పేర్కొన్నారు. -
వాటర్ ప్లాంట్ నిర్మాణం అభనందనీయం: వైవీ
ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం అయోధ్యలంక గ్రామస్తుల తాగునీటి కష్టాలను ఆచంట వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తీర్చారు. గోదావరి మధ్యలోనే గ్రామమున్నా అనేక దశాబ్దాలుగా అయోధ్యలంక గ్రామస్తులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసి అయోధ్యలంక గ్రామాన్ని దత్తత తీసుకుని సొంత నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. గ్రామంలో రూ.8 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మించి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ..వెనకబడిన లంక గ్రామాన్ని దత్తత తీసుకుని సొంత నిధులతో శ్రీరంగనాథ రాజు అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. అలాగే అయోధ్యలంకలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు
సాక్షి, ఉండి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పోటెత్తున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైఎస్సార్ సీపీలో వెల్లువలా చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో సత్యనారాయణ, ఆయన మద్దతుదారులను వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు. వైఎస్ జగన్ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరూ లేరని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరినట్టు చెప్పారు. 27న వైఎస్సార్ సీపీలో చేరతా: చెరుకువాడ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మాజీ శాసనసభ్యుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాధరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 27న భీమవరం నియోజకవర్గం చిన అమిరంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.