సాక్షి, గుంటూరు: చిలకలూరిపేటలో రూ.46 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. గడియార స్తంభం వద్ద మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, విడదల రజిని పాల్గొన్నారు.
ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు: బొత్స సత్యనారాయణ
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. అనుకూల మీడియాతో చంద్రబాబు.. పథకం ప్రకారం బురదచల్లుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా సీఎం జగన్ ప్రజలను ఆదుకున్నారని, గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు.
ఆరోగ్య ప్రదాతగా నిలిచారు: శ్రీరంగనాథ రాజు
ఈనెల 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని 2400 జబ్బులను ఆరోగ్యశ్రీ లో చేర్చి సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య ప్రదాత అనిపించుకున్నారని తెలిపారు.
అమరావతి ఉద్యమం ఒక ఫేక్: అంబటి రాంబాబు
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు దొడ్డిదారిన లోకేష్‌ను మంత్రిని చేశారని మండిపడ్డారు. లోకేష్‌ను ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు గెలిపించుకోలేక పోయారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేయిస్తున్న అమరావతి ఉద్యమం ఒక ఫేక్ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment