మంత్రి శ్రీరంగనాథరాజును సత్కరిస్తున్న మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పుష్పరాజ్
సాక్షి, పెనుగొండ(పశ్చిమగోదావరి) : ఎన్నికల్లోనూ, ప్రజాసంకల్పయాత్రలోనూ ఇచ్చిన హామీలు, సమయపాలన, సమన్యాయంతో నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం తూర్పుపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు, ఆయా గ్రామాల సమస్యలు సావదానంగా ఆలకించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అ«ధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు మంత్రి శ్రీరంగనాథరాజును కలిసి సమస్యలు విన్నవించుకుని ఘనంగా సత్కరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పూర్తిగా ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలోనూ శిథిలమైన ఎస్సీ కమ్యూనిటీ భవనాలను రిపేర్లు చేయాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, దళిత కాలనీల్లో రహదారి, డ్రెయినేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బ్యాక్‌ల్యాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అంబేడ్కర్ విగ్రహాలను కూల్చిన వారిపై ప్రత్యేక చట్టం రూపొందించి వారిని కఠినంగా శిక్షంచాలని కోరారు.
మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ అర్హులై ప్రతి ఒక్కరికీ కులమత, వర్గాలు, పార్టీలకు అతీతంగా అందించడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామాల్లో మంచినీటి చెరువులు శుభ్రం చేసి స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ చేయడానికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ మండల కన్వీనర్లు దంపనబోయిన బాబూరావు, కర్రివేణుబాబు, రుద్రరాజు శివాజీరాజు, పార్టీ నాయకులు గుంటూరి పెద్దిరాజు, చేకూరి సూరిబాబు, మేడిచర్ల పండు, కర్రి గౌరీ సుభాషిణి, బొక్కా అరుణ, ముప్పాళ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment