
ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం అయోధ్యలంక గ్రామస్తుల తాగునీటి కష్టాలను ఆచంట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తీర్చారు. గోదావరి మధ్యలోనే గ్రామమున్నా అనేక దశాబ్దాలుగా అయోధ్యలంక గ్రామస్తులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసి అయోధ్యలంక గ్రామాన్ని దత్తత తీసుకుని సొంత నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. గ్రామంలో రూ.8 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మించి వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేత ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ..వెనకబడిన లంక గ్రామాన్ని దత్తత తీసుకుని సొంత నిధులతో శ్రీరంగనాథ రాజు అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. అలాగే అయోధ్యలంకలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment