రూ. 5 భోజనం చేసిన వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే | ap ysrcp mla visits rs 5 meals centers in hyderabad | Sakshi
Sakshi News home page

రూ.5 భోజనం చేసిన వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే

Published Wed, Apr 12 2017 2:58 PM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

తెలంగాణలో అమలులో ఉన్న రూ.5 భోజనాన్ని వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.


హైదరాబాద్‌: తెలంగాణలో అమలులో ఉన్న రూ.5 భోజనాన్ని వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయన బుధవారం నగరంలోని జీహెచ్‌ఎంసీ ఆధ్వర‍్యంలో హరే కృష్ణ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న భోజన కేంద్రానికి వెళ్లారు. మండే ఎండలో క్యూ లైన్‌ల్‌ నిల్చుని భోజనం సదుపాయాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడే బోజనం చేశారు.
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఈ కార్యక్రమం బాగుందని, తన నియోజక వర్గం మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమం పెట్టి సొంతంగా పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం క్షేత్ర స్థాయిలో రూ. 5 భోజన పథకాన్ని స్యయంగా పరిశీలిస్తున్నట్టు ఆర్కే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement