చేనేత కార్మికుల సమస్యలపై కానీ, లేక మరే సమస్య పైన అయినా ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను పలకరించారా అని ఎద్దేవా చేశారు. మంగళగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే నిధులు అడగడం లేదని లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారని, దానిపై మీ సమాధానమేంటని విలేకరులు ప్రశ్నించగా, ఆర్కే లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.