సాక్షి, గుంటూరు: పోలీసులపై టీడీపీ నేతల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తుమ్మపూడి ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి, చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే చెప్పామన్నారు.
పరామర్శ పేరిట రాజకీయం చేసేందుకు లోకేష్ వచ్చారని ఎమ్మెల్యే విమర్శించారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నారని, పరామర్శకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజకీయాల కోసం పోలీసులపై రాళ్లు వేస్తారా అని మండిపడ్డారు. ఆస్పత్రి వద్ద లోకేష్ వచ్చే వరకు మృతదేహాన్ని ఉంచాలని అడ్డుకోవడం దారుణమన్నారు.
చదవండి: టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీపై మంత్రి బొత్స క్లారిటీ
తుమ్మపూడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు చేపట్టినప్పటికీ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. శవ రాజకీయాలు చేస్తే ప్రజలు ఓట్లు వేయరని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. వందలమందితో వచ్చి టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు.
చదవండి: తుమ్మపూడిలో ఉద్రిక్తత.. లోకేష్ రాకతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment