ఇది పన్నుల రాజధాని!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రజారాజధానిలా కాకుండా.. పన్నుల రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12వ రోజున ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ప్రభుత్వం అవాస్తవాలను చెబుతోందని మండిపడ్డారు.
రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను 99 ఏళ్లు లీజుకిచ్చి తమ బినామీలకు మేలు చేసేలా ప్రభుత్వ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు. చివరకు రాజధాని డిజైన్లను కూడా ప్రైవేటు వ్యక్తులే ఇచ్చారని, ప్రతిదాన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.