
సాక్షి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీనా?.. సోమవారం చంద్రబాబు చేసిన ర్యాలీ ప్రభుత్వానిదా..? పార్టీదా..? నాలుగేళ్లు ఘోరాలు, పాపాలు చేసి ఇప్పుడు ర్యాలీలు చేస్తారా..? కాల్ మనీ కేసు రిపోర్ట్ ఏమైంది? ఎవరినైనా అరెస్టు చేశారా..? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 3000 అత్యాచార ఘటనలు జరిగాయని, వాటిపై తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు రక్షణ ఇచ్చింది చంద్రబాబేనని, ఇపుడు మహిళలకు రక్షణ అంటే నమ్మేదెవరన్నారు. చంద్రబాబు మానస్థిక పరిస్థితి బాగానే ఉందా అని ఎద్దేవా చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదిక.. చంద్రబాబు వాయిస్సే నని తేల్చింది కాబట్టి బాబు గౌరవంగా పదవి నుంచి తప్పుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment