ఓటుకు కోట్లు కేసులో తనతో పాటు తన ఇద్దరు కుమారులకు ఈడీ నోటీసులు ఇచ్చిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ అనంతరం మాట్లాడుతూ.. ‘ ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహకు కూడా నోటీసులు ఇచ్చారు. నాతో పాటు నా కొడుకులను విచారించడం చాలా బాధేసింది. వారిని ఇరికించడం సరికాదు. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థల విచారణను ఉద్దేశపూర్వకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిజాలన్నీ కోర్టు విచారణలో తేలతాయి.