vem narendar reddy
-
రేవంత్ నిర్బంధంపై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నిర్బంధం.. ఇందుకు పరిహారం చెల్లించే వ్యవహారంపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌ను అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రేవంత్ నిర్బంధం విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు పాటించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. నిర్బంధానికి ముందు రేవంత్ కుటుంబసభ్యులకు నోటీసులిచ్చేందుకు ప్రయత్నించామని, వారు తిరస్కరించడంతో రేవంత్ అనుచరుడు అంజి అనే వ్యక్తికి ఇచ్చామని చెబుతున్నారని, ఇది అబద్ధమని వివరించారు. అంజి అనే పేరుతో రేవంత్ అనుచరుల్లో ఎవరూ లేరని, ఈ విషయాన్ని తాము ఇప్పటికే కోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించామని తెలిపారు. రేవంత్ నిర్బంధం తర్వాతే పోలీసులు నివేదిక తయారు చేశారని, అందుకే దానిపై తేదీ, సమయం లేదని వివరించారు. రేవంత్ నిర్బంధంపై హైకోర్టు తీవ్రంగా స్పందించాక అధికారులు ఆ నివేదికను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. తలుపులు పగులగొట్టి బెడ్రూంలోకి పోలీసులు వచ్చారని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ ఘటనా స్థలం లేరని, ఎవరో చెప్పిన మాటల ఆధారంగా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది రోహత్గీ ఆరోపించారని, దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించింది. రేవంత్ కుటుంబ సభ్యుల్లో పిటిషనర్ ఒకరిగా మెలుగుతున్నారని, ఆయన ఘటనా స్థలంలో లేకపోయినా, రేవంత్ కుటుంబసభ్యులతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నారని మోహన్‌రెడ్డి చెప్పారు. వాస్తవాలతో దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదనడం సరికాదన్నారు. ఎంసీ మోహతా కేసులో అధికార దుర్వినియోగం జరిగిప్పుడు బాధితులకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అందువల్ల ఈ కేసులో బాధితునికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ నిర్బంధానికి సంబంధించిన వీడియో ఫుటేజీ, సబ్ టైటిల్స్‌తో అందించాలని పోలీసులకు మరోసారి స్పష్టం చేస్తూ కోర్టు తీర్పును వాయిదా వేసింది. -
రేవంత్ నిర్బంధ వీడియో ఫుటేజీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని నిర్బంధంలోకి తీసుకున్న రోజు చిత్రీకరించిన మొత్తం వీడియో ఫుటేజీని తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వీడియోలోని మాటలను ఇంగ్లిష్‌లో సబ్‌టైటిల్స్‌లో ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ రేవంత్‌రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై అప్పట్లో విచారణ జరిపిన జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం.. పోలీసులపై నిప్పులు చెరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యక్తిగత హాజరుకు సైతం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, అక్రమ నిర్బంధానికి పరిహారం చెల్లించే విషయంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆదేశించింది. ఎవరో చెప్పిన దాని ఆధారంగా పిటిషన్.. ఈ వ్యాజ్యాన్ని నరేందర్‌రెడ్డి ఎవరో చెప్పిన విషయాల ఆధారంగా దాఖలు చేశారని, అందువల్ల దీనికి విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు. ఘటన జరిగిన రోజు ఘటనాస్థలిలో నరేందర్‌రెడ్డి లేరని చెప్పారు. రేవంత్ నిర్బంధంపై ఆయన కుటుంబసభ్యులకు లేని అభ్యంతరం పిటిషనర్‌కు ఎందుకో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. స్నేహితుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని తాను చెప్పట్లేదని, అయితే కుటుంబసభ్యులు కోర్టుకు రాకుండా, ఎవరో చెప్పిన విషయాల ఆధారంగా నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంపైనే తమకు అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. రేవంత్‌ను కొద్ది గంటల పాటే నిర్బంధించారు. ఆ తర్వాత ఆయనను విడిచిపెట్టామని తెలిపారు. హెబియస్ కార్పస్ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే పిటిషనర్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. రేవంత్ నిర్బంధం విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, నిర్బంధంలోకి తీసుకునే ముందు నోటీసు ఇచ్చినా రేవంత్ సతీమణి గీతారెడ్డి నోటీసు తీసుకునేందుకు నిరాకరించారని, అయితే అతని అనుచరుడు అంజి నోటీసు తీసుకున్నారని చెప్పారు. రేవంత్ బలమైన నాయకుడు.. ప్రభుత్వం దృష్టిలో రేవంత్‌రెడ్డి చాలా బలమైన నాయకుడని, ఆ విషయం అందరికీ తెలుసని, అందుకే ఆయన విషయంలో ముందస్తు చర్యలు తీసుకున్నారని రోహత్గీ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి నిర్బంధం విషయాన్ని అప్పటి ఎస్పీ అన్నపూర్ణ పైఅధికారులతో పాటు రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారికి కూడా తెలియజేశారన్నారు. వారి ఆదేశాల మేరకే ఆమె రేవంత్ విషయంలో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సభను బహిష్కరిస్తామంటూ రేవంత్ ప్రకటన చేశారని, దీని వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే అప్పుడు కూడా వారినే నిందించే వారని తెలిపారు. ఇలాంటి కేసుల్లో పరిహారం చెల్లించాల్సిన అవసరమే లేదన్నారు. మొత్తం ఫుటేజీ ఇవ్వండి.. ఈ సమయంలో వీడియోగ్రఫీ తాలూకు సీడీ గురించి చర్చకొచ్చింది. ఆ సీడీని కోర్టు ముందుంచుతామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ చెప్పారు. దీనిపై రేవంత్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ.. పోలీసులు ఇచ్చే సీడీలను పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. వారు తమ వాదనలకు బలం చేకూర్చేలా ఎడిట్ చేసిన సీడీలు ఇస్తారని, దీనివల్ల తమకు నష్టం కలుగుతుందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, తమకు మొత్తం వీడియో ఫుటేజీ సీడీ సమర్పించాలని, ఆ సీడీలోని మాటలను ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులపైకి కుక్కలు వదిలారు.. పోలీసులు మర్యాద గా వ్యవహరించారని, రేవంత్‌రెడ్డి అనుచరులే దురుసుగా వ్యవహరించారన్నారు. పోలీసులపైకి కుక్కలను వదిలారన్నారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీయించామని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. పోలీసు అధికారి నగేశ్ ఇచ్చిన సమాచారం కారణంగా రేవంత్‌ను నిర్బంధంలోకి తీసుకున్నామని చెబుతున్నారు. మరి ఆయన ఇచ్చిన నివేదికపై తేదీ, సమయం, సీల్ లేవు. దాన్ని ఎలా విశ్వాసంలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఎవరైనా అలాంటిది ఇచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని విస్మరించరాదని, ఇలాంటి వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. రోహత్గీ స్పందిస్తూ.. మనమంతా ఏసీ రూముల్లో కూర్చొని చాలా చెబుతుంటామని, క్షేత్రస్థాయిలో పోలీసులు భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని రేవంత్ నిర్బంధానికి ఈ వాదన ఎంత మాత్రం సమర్థనీయం కాదంది. -
‘నా కుమారులను ఇరికించడం సరికాదు’
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఈడీ ఎదుట వేం నరేందర్ రెడ్డి విచారణ ముగిసింది. నరేందర్ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను విచారించిన ఈడీ... నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు, మిగతా నాలుగున్నర కోట్ల గురించి కూడా ఆరా తీసింది. ఈ సందర్భంగా వారు పొంతన సమాధానాలు చెప్పడంతో సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. బ్యాంకు స్టేట్మెంట్స్, ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఇచ్చిన సమాచారంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది. కాగా ఏసీబీ చార్జ్‌షీట్ ఆధారంగా ఈ కేసులో నిందితులందరినీ విచారించే అవకాశం ఉంది. ఈమేరకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీచేసిన ఈడీ వారం రోజుల్లో విచారణకు రావాలని ఆదేశించింది. నా కొడుకులను ఇరికించడం సరికాదు ఓటుకు కోట్లు కేసులో తనతో పాటు తన ఇద్దరు కుమారులకు ఈడీ నోటీసులు ఇచ్చిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ అనంతరం మాట్లాడుతూ.. ‘ ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహకు కూడా నోటీసులు ఇచ్చారు. నాతో పాటు నా కొడుకులను విచారించడం చాలా బాధేసింది. వారిని ఇరికించడం సరికాదు. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థల విచారణను ఉద్దేశపూర్వకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిజాలన్నీ కోర్టు విచారణలో తేలతాయి. ఎప్పుడు విచారణకి పిలిచినా హాజరవుతా’ అని పేర్కొన్నారు. కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ కేసులో ఈడీ ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉదయ సింహను విచారించిన సంగతి తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసు: ఈడీ విచారణకు నరేందర్ రెడ్డి కొడుకు
-
ఓటుకు కోట్లు కేసు; ‘నా కుమారులను ఇరికించడం సరికాదు’
-
ఓటుకు కోట్లు కేసు : ఈడీ విచారణలో నరేందర్ రెడ్డి
-
ఓటుకు కోట్లు కేసు : నరేందర్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు లెక్కలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ ముందు ఉంచి మరీ... రూ. 50 లక్షలతో పాటు ఇవ్వజూపిన మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన సమాచారంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కీర్తన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ కేసులో ఈడీ ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉదయ సింహను విచారించిన సంగతి తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసు; వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు
-
ఓటుకు కోట్లు కేసు; నరేందర్‌రెడ్డికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట్లు’ కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
టీఆర్ఎస్ విజయానికే రేవంత్ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో సాయం చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించారని ఆయన సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. చివరకు పోలీసుల సహకారంతో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా పరిగణించాలని, భవిష్యత్‌లో ఏ అధికారి కూడా ఇలా చేయకుండా కఠినంగా శిక్షించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ శిక్ష మిగిలిన పోలీసులకు ఓ పాఠం కావాలన్నారు. ప్రచారం ముగింపు ముందు రోజు రేవంత్‌ను పోలీసులు నిర్భంధించారని, దీని ఫలితంగా అతను ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. రేవంత్ నిర్భంధం వ్యవహారంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని హైకోర్టుకు నివేదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి రేవంత్‌ని అక్రమంగా నిర్భంధించి, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించిన నేపథ్యంలో నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం, రేవంత్ నిర్భంధం విషయంలో పోలీసుల తీరును తప్పుపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అప్పటి వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఆమె కౌంటర్ దాఖలు చేయగా, దీనికి తిరుగు సమాధానం ఇవ్వాలని నరేందర్‌రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రేవంత్‌ది అక్రమ నిర్భంధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు జనవరి 22న విచారణ జరపనుంది. -
తెలంగాణ టీడీపీకి మరో షాక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మారో షాక్ తగిలింది. ఇప్పటికే పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఆయన బాటలోనే మరోనేత అనుసరిస్తున్నారు. టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. కాగా తానూ ఎన్టీఆర్ పిలుపుమేరకే రాజకీయాల్లోకి వచ్చానని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. జీవితమే తెలుగుదేశం పార్టీగా పని చేశానని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో నాయకత్వం లోటు కనిపిస్తోందన్నారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన సాగుతోందని వేం నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక ఇప్పటికే రేవంత్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో తెలంగాణ టీడీపీలో అలజడి రేపుతోంది. దీంతో రేవంత్‌రెడ్డి వెంట నడిచేందుకు మరికొందరు టీటీడీపీ నాయకులు కూడా హస్తం గూటికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. -
వేం నరేందర్‌రెడ్డికి బిగుసుకుంటున్న ఉచ్చు
-
టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ...ఇద్దరి డ్రైవర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా సీఆర్పీసీ 160 కింద...టీడీపీ నేత డ్రైవర్లకు నోటీసులు ఇచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండురోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు వేం నరేందర్‌రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కృష్ణకీర్తన్ రెడ్డిని విచారించిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో నరేందర్‌రెడ్డి పాత్రపై ఏసీబీకి పలు అనుమానాలు కలిగినట్లు సమాచారం. -
ఏసీబీ ఎదుట హాజరైన కృష్ణ కీర్తన్
-
ఓటుకు కోట్లు.. నాటకీయ పరిణామాలు
ఓటుకు కోట్లు కేసులో బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని చెప్పిన కాసేపటికే.. ఆయన తాను అరెస్టు కాలేదంటూ బయటికొచ్చి, స్వేచ్ఛగా ఇంటికి వెళ్లిపోయారు. అలాగే ఈ కేసులో అత్యంత కీలక సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తన వాంగ్మూలాన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో నమోదు చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలు ఒక్కసారి చూద్దాం.. * నోటీసులిచ్చినా రాజీనామా చేయబోనని సన్నిహితులతో తెలిపిన చంద్రబాబు * ఉదయం 8 గంటలకు ఆంధ్రా పోలీసులను రీకాల్ చేసిన ఏపీ డీజీపీ జెవి రాముడు * ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌తో డీజీపీ అనురాగ్ శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి భేటీ * ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ - 6 గంటల పాటు చర్చలు * ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని పిలిచిన తెలంగాణ ఏసీబీ, కార్యాలయానికి వచ్చిన నరేందర్ రెడ్డి * ఉదయం 10.50 గంటలకు నిందితుడు మత్తయ్యను ప్రవేశపెట్టిన విజయవాడ పోలీసులు, మత్తయ్యకు ప్రాణ భయం ఉందని వెల్లడి, మత్తయ్య ఫిర్యాదును సీఐడీ పర్యవేక్షిస్తోందని ప్రకటన * మధ్యాహ్నం12 గంటలకు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఈ నెల 24కు వాయిదా వేసిన హైకోర్టు * మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్, గవర్నర్ తో చర్చలు * మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి కోర్టుకు వచ్చిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం, స్టీఫెన్సన్ కూతురు జెస్సికా, ఇంటి ఓనర్ మార్క్ టేలర్ వాంగ్మూలం కూడా సేకరణ * సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీ ప్రెస్ మీట్, చంద్రబాబు సర్కారును బర్తరఫ్ చేయాలన్న ధర్మాన * సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరైన డీజీపీ జేవీ రాముడు * సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఏసీబీకి ఎన్నికల ప్రధాన సంఘం నుంచి లేఖ, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సూచించిన ఎన్నికల కమిషన్ * సాయంత్రం 4.15 గంటలకు వేం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు ఏసీబీ వర్గాల సమాచారం * సాయంత్రం 05.20కి ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వేం నరేందర్ రెడ్డి, అరెస్ట్ కాలేదని ప్రకటన -
వేం నరేందర్ రెడ్డిని విడిచిపెట్టిన ఏసీబీ
-
ఏసీబీ అదుపులో వేం నరేందర్ రెడ్డి
-
వేం నరేందర్ రెడ్డిని విడిచిపెట్టిన ఏసీబీ
ఓటుకు నోటు కేసులో ఏసీబీ వర్గాలు ముమ్మరంగా విచారించిన తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని విడిచిపెట్టారు. విచారణ అనంతరం ఆయన తిరిగి ఇంటికి వెళ్లారు. వాస్తవానికి దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగిన తర్వాత నేరుగా ఏసీబీ పోలీసులు వేం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తారని కూడా ఏసీబీ వర్గాల నుంచి సమాచారం అందింది. అయితే, తర్వాత పరిణామాలు నాటకీయంగా మారిపోయాయి. విచారణకు తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు హాజరవుతానని, అరెస్టు కాలేదని చెబుతూ, నివాసానికి చేరుకున్నారు. ఆయన మీడియాతో ఏమన్నారంటే... ''వాళ్లు అడిగిన వాటికి సమాధానాలు చెప్పాను, అరెస్టు కాలేదు. అలాంటిది ఏమీ లేదు. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాము. మేం ఎలాంటి తప్పు చేయలేదు. ఎప్పుడు పిలిచినా వాళ్లకు కావల్సిన సమాచారం ఇస్తామని చెప్పాము. వాళ్లు అడిగిన వాటికి స్పష్టంగా సమాధానాలు చెప్పాము. ఇన్వెస్టిగేషన్‌కు సహకరిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాము''.