
టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు
ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ...ఇద్దరి డ్రైవర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ...ఇద్దరి డ్రైవర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా సీఆర్పీసీ 160 కింద...టీడీపీ నేత డ్రైవర్లకు నోటీసులు ఇచ్చారు.
కాగా ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండురోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు వేం నరేందర్‌రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కృష్ణకీర్తన్ రెడ్డిని విచారించిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో నరేందర్‌రెడ్డి పాత్రపై ఏసీబీకి పలు అనుమానాలు కలిగినట్లు సమాచారం.