ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు సైదులు, అల్లూరి నారాయణరాజుకు అధికారులు నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు సైదులు, అల్లూరి నారాయణరాజుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రేవంత్ డ్రైవర్కు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ఫోరెన్సిక్ తుది నివేదక నేడు ఏసీబీ కోరుకు చేరనుంది.
ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా ఉన్న ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికను గతంలోనే కోర్టుకు అందజేసింది. అయితే వీటిపై మరింత శోధన చేసిన ల్యాబ్... సమగ్ర వివరాలతో కూడిన తుది నివేదికను కోర్టుకు అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో వేగం పెంచనున్నట్లు సమాచారం. మరికొంత మందిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.