ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసు వాయిదాకు ఆయన కోర్టుకు వచ్చారు. తదుపరి విచారణ ఈనెల 14వ తేదీకి వాయిదాఇ పడింది.
కాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ రాలేకపోతున్నట్లు రేవంత్ తరపు న్యాయవాదులు గతంలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసినా... వాయిదాకు రేవంత్ రెడ్డి కచ్చితంగా హాజరు కావల్సిందేనని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్సింహా కోర్టుకు హాజరు అయ్యారు.