Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

US Prez Trump massive Military move In Asia Region Check Full Details1
ట్రంప్‌ సైలెంట్‌ బాంబ్‌! అంతకు మించి..

వాషింగ్టన్‌: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్‌(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్‌చుప్‌గా ఆసియా రీజియన్‌లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్‌ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్‌లోని యూఎస్‌-బ్రిటన్‌ మిలిటరీ బేస్‌ డియాగో గార్సియా రన్‌వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్‌ సిగ్నల్స్‌ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్‌ రీజియన్‌లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్‌ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్‌లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్‌ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్‌ ఈస్ట్‌, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్‌, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్‌ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్‌ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్‌ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్‌ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్‌ వద్ద యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ క్యారీయర్‌ను, మిడిల్‌ ఈస్ట్‌లో యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్‌సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్‌ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది.

Growing pressure within the party on Chandrababus approach to the Waqf Bill2
వక్ఫ్‌ బిల్లుకు మద్దతుపై ముసలం!

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బిహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జేడీయూకు బిహార్‌ ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటే­యడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ద్వారా కుటుంబ వ్యవహారాలను మాట్లాడించడంతోపాటు రుషికొండ గురించి టీడీపీ కరపత్రంలో తప్పుడు కథనాలు రాయించారు. వైఎస్సార్‌ సీపీ వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని పొద్దున టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించిన చంద్రబాబు సాయంత్రాని కల్లా అనుకూలంగా ఓటు వేసిందంటూ మరో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.పెరుగుతున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి..వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఎన్డీఏ పక్షాలు జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు బిహార్, యూపీలో పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటం.. టీడీపీ రెండు నాలుకల వైఖరిపై ముస్లిం సమాజంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారు. తనకు అలవాటైన డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌ సీపీపై సోషల్‌ మీడియాలో తలా తోకా లోకుండా దుష్ప్రచారానికి పచ్చ కూలీలను రంగంలోకి దించారు. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయం వక్ఫ్‌ బోర్డునకు చెందినదని, అందుకే లోక్‌సభలో వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వ్యతిరేకించారని.. రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేయించారని.. విప్‌ జారీ చేయలేదని.. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేని ప్రచారం చేయించుకున్నారు. సవరణ బిల్లులో ఏమాత్రం సత్తాలేని మూడు సవరణలు ప్రతిపాదించి ముస్లింలను మభ్యపుచ్చేందుకు యత్నించి బోనులో నిలబడ్డ చంద్రబాబు తన నిర్వాకాలకు సమాధానం చెప్పకుండా బురద చల్లేందుకు విఫల యత్నాలు చేశారు.మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఎన్నికల సమయంలో చంద్రబాబు గంభీరంగా ప్రకటనలు చేయగా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మైనార్టీలకు నష్టం జరిగితే ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పారు. వక్ఫ్‌ బిల్లు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలంతా టీడీపీని నిలదీస్తుండటంతో దీని నుంచి బయట పడేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు పీ 4 కార్యక్రమం దాకా నోరు తెరిస్తే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్‌ బిల్లుపై స్పందించాల్సి పోయి కుటుంబ విషయాలను ప్రస్తావించటాన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటున్నట్లు మరోసారి స్పష్టమైందని, ఇదంతా డైవర్షన్‌ రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు.స్పష్టంగా వ్యతిరేకించిన వైఎస్సార్‌ సీపీ.. ఆది నుంచి అదే విధానంవక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్‌ సీపీ మొదటినుంచి తన విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ప్రకటించారు. ఆ మేరకు మొన్న లోక్‌సభలో.. నిన్న రాజ్యసభలోనూ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటు వేసింది.వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్‌ సీపీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది. బిల్లును పార్టీ వ్యతిరేకించిందనేందుకు లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయ సభల కార్యకలాపాలే తిరుగులేని రుజువు. వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ప్రసంగాలే మరొక సాక్ష్యం.టీడీపీ ప్రతిపాదించిన నిస్సత్తువ సవరణలివీ..వక్ఫ్‌ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా.. సత్తువ లేని సవరణలు ప్రతిపాదించి వాటికి జేపీసీ (పార్లమెంట్‌ సంయుక్త కమిటీ) ఆమోదం తెలిపిందని, అది తమ ఘనతేనని టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది. జేపీసీకి టీడీపీ సవరణలు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం, జాతీయ మీడియాలో ప్రచారం చేసుకోవటమేగానీ దీనికి సంబంధించి ఎక్కడా కనీసం కసరత్తు చేసిన దాఖలాలు లేవని, ఏ ఒక్కరినీ సంప్రదించలేదని పేర్కొంటున్నారు. అసలు టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు ఏమాత్రం పస లేనివని, ముస్లింల పట్ల ఆ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిహార్‌ ఎన్నికల ముంగిట ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షం ఎన్డీఏకి ఆ పార్టీ నేతలు షాకులిస్తున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు సీఎం నితీష్‌ సారథ్యంలోని జేడీయూ మద్దతివ్వటాన్ని నిరనిస్తూ పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తున్నారు.1) సాధారణంగా కొత్త చట్టాలన్నీ అవి రూపుదిద్దుకుని ఆమోదం పొందిన నాటి నుంచే అమలులోకి వస్తాయి. అంతేగానీ పాత తేదీలకు వర్తించవు. అలాంటప్పుడు ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం లేదంటూ టీడీపీ ప్రతిపాదించిన సవరణకు ఏం విలువ ఉంటుందని ముస్లిం పెద్దలు నిలదీస్తున్నారు.2) రెండో సవరణ కింద.. వక్ఫ్‌ ఆస్తుల నిర్థారణలో జిల్లా కలెక్టర్‌కు తుది అధికారం ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్‌ ర్యాంకింగ్‌ అథారిటీ ఉన్న అధికారిని నియమిస్తుందని ప్రతిపాదించారు. అధికారులు ఎవరైనప్పటికీ ఆయా ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటప్పుడు కలెక్టర్‌ అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఒకటే కదా! ఏ అధికారిని నియమించినా ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు కదా!! మరి ఈ సవరణ సత్తువ లేని సవరణ కాదా?3) మూడో సవరణ పేరుతో.. డిజిటల్‌ పత్రాలను సమర్పించేందుకు ఆర్నెళ్లకుపైగా గడువు పొడిగింపును ప్రతిపాదించారు. వక్ఫ్‌ ఆస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ లాంటి బీజేపీ నేతలే చెబుతున్నారు. అంటే.. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియకు టీడీపీ సవరణలను ప్రతిపాదించిందని భావించాలా??

Piyush Goyal Reacts On His Startup Remarks Criticism Linked With Congress3
స్టార్టప్‌లపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: భారత్ స్టార్టప్‌లను ఉద్దేశించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్(Piyush Goyal) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. విమర్శించడం తేలికని, భారత్‌కు భారీస్థాయిలో ఏఐ మోడల్ ఎందుకు లేదో విశ్లేషించాలని, ఎదగడానికి ప్రయత్నిస్తున్నవారిని అణచి వేయకూడదని పలు కంపెనీల సీఈవోలు, గోయల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.అయితే.. భారత స్టార్టప్‌ల(Indian Start Ups)ను తానేం తక్కువ చేయలేదని గోయల్‌ అంటున్నారు. చైనా తరహాలో ఏఐ వంటి అంశాలపై దృష్టి సారించాలని మాత్రమే తాను సూచించానని, దీనిపై పలు రకాల విమర్శలు రావడంతో కాంగ్రెస్‌ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తోందని గోయల్‌ ఆరోపించారు.‘‘నేను చేసిన వ్యాఖ్యలు చాలామందికి సానుకూలంగానే తీసుకున్నారు. భారత్‌ పోటీ ప్రపంచంలో ముందు ఉండేందుకు సిద్ధమని నాతో చెప్పారు. కానీ, కొందరు మాత్రం నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు’’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయల్‌ అన్నారు.స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గోయల్‌ మాట్లాడుతూ.. దేశంలోని పలు స్టార్టప్‌ కంపెనీలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా దృష్టి సారించాయన్నారు. కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు. కానీ, మనం ఐస్‌క్రీం, చిప్స్‌ అమ్మడం దగ్గరే ఉన్నాం. ఇక్కడే మనం ఆగిపోకూడదు. డెలివరీ బాయ్స్‌/గర్ల్స్‌గానే మిగిలిపోదామా? అదే భారత్‌ లక్ష్యమా..? అది స్టార్టప్‌ల ఉద్దేశం కాదు కదా’’ అని అన్నారు.అయితే.. భారత్‌లో స్టార్టప్‌లను తక్కువ చేయొద్దంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) ఓ పోస్ట్‌ చేసింది. భారత్‌లో స్టార్టప్‌ కంపెనీలు పడుతున్న కష్టాలను పీయూష్‌ గోయల్‌ అంగీకరించారు. తద్వారా స్టార్టప్‌లపై ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారం అబద్ధాలేనని మంత్రి వ్యాఖ్యలతో తేటతెల్లమైంది అని ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేసింది.Modi's Minister Reveals India's Struggling Startup Ecosystem 👇 pic.twitter.com/7V7uVG316d— Congress (@INCIndia) April 4, 2025

Nag Ashwin Family Went Tirumala For Darshan After The Update Kalki2 Movie4
తిరుమలలో నాగ్‌ అశ్విన్‌.. కల్కి2 గురించి అప్డేట్‌

డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin), ప్రియాంక దత్‌ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాటు వారు పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి వెళ్తుండగా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' పార్ట్‌-2 అప్‌డేట్‌ గురించి అడిగారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.చాలారోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని నాగ్‌ అశ్విన్‌ అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ అంతా అంతా బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కల్కి2 సినిమా గురించి మాట్లాడుతూ.. అందుకు ఇంకా చాలా టైమ్ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని చెప్పారు. పూర్తయిన దాని బట్టి షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన ప్రకటించారు.‘కల్కి’ పార్ట్‌2 గురించి కొద్దిరోజుల క్రితమే మీడియా సమావేశంలో నాగ్‌ అశ్విన్‌ మాట్లాడారు. మహాభారతం నేపథ్యం నుంచి సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్‌ చేశామన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ది రాజా సాబ్‌, ఫౌజీ (వర్కింగ్‌ టైటిల్‌), స్పిరిట్‌, సలార్‌2, కల్కి2 చిత్రాలు ఉన్నాయి. అందుకే కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్‌ ఉంది.

Waqf Bill Effect five leaders resign To Nitish Kumar JDU5
సీఎం నితీశ్‌ కుమార్‌కు బిగ్‌ షాక్‌

పాట్నా: బీహార్‌లో ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బీహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. తాజాగా మరో కీలక నాయకుడు నదీమ్‌ అక్తర్‌ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో, ఎన్నికలకు ముందు బీహార్‌లో జేడీయూకు ఎదురుదెబ్బ తగిలింది.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఉభయసభల్లో మద్దతు తెలుపుతూ ఓటింగ్‌లో పాల్గొన్నాయి. ఈ ‍క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షమైన నితీష్ కుమార్ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ఓటు వేయడంతో.. ఆ పార్టీలోని మైనార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత నదీమ్‌ అక్తర్ పార్టీకి రాజీనామా చేశారు. అంతకంటే ముందు.. జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షానవాజ్ మాలిక్, అలీఘర్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తబ్రేజ్ సిద్ధిఖీ, భోజ్‌పూర్‌కు చెందిన సభ్యుడు మొహమ్మద్ దిల్షాన్ రైన్, మాజీ అభ్యర్థి మొహమ్మద్ ఖాసిం అన్సారీ, రాజు నయ్యర్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీహార్‌లో ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో వరుసగా నేతలు రాజీనామా చేస్తుండటంతో జేడీయూ ముస్లిం ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయమని ఆ రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.JDU muslim leaders are resigning in bulk Nitish Kumar Muradabad, Nitish Kumar hai hai 😡😡pic.twitter.com/1mbnpAQvei— Chandan Sinha (I Am Ambedkar) (@profAIPC) April 4, 2025మరోవైపు.. తబ్రేజ్ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత నితీష్ కుమార్‌కి పంపారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింల విశ్వాసాన్ని దెబ్బతీశారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘మీరు మీ లౌకిక ఇమేజ్‌ను కొనసాగిస్తారని నేను ఆశించాను, కానీ ముస్లింలకు వ్యతిరేకంగా పదేపదే పనిచేసిన శక్తులతో నిలబడాలని మీరు ఎంచుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ , పౌరసత్వ సవరణ చట్టం వంటి చర్యల తర్వాత ఏన్డీయే ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని, ఇది ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. ఎన్డీయే మరో మిత్రపక్షమైన ఆర్ఎల్డీలో కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాజాయిబ్ రిజ్వి శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ జయంత్ చౌదరి.. లౌకికవాదాన్ని విడిచిపెట్టారని, ముస్లింలకు మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. ముస్లింలు జయంత్ చౌదరికి మద్దతు ఇచ్చారని, కానీ ఈ సమయంలో మాతో నిలబడలేదని రిజ్వీ అన్నారు. దీంతో, వక్ఫ్‌ సవరణ బిల్లును ఎన్డీయే మిత్రపక్ష పార్టీల్లో అగ్గి రాజేసింది. అసంతృప్తి నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. BREAKING NEWS TODAY 🚨First JDU Senior leader Mohammad Kasim Ansari and Now JDU Minority Pradesh Secratary Shah Nawaz Malik resign on #WaqfBoard Slowly slowly Muslim leader resign from JDU JDU support #WaqfBillAmendment bills in Lok sabha pic.twitter.com/US5ckR7YBE— Ashish Singh (@AshishSinghKiJi) April 3, 2025

Tension at the police station due to the TDP leaders6
కలెక్టర్‌ వీపు బద్దలు కొడతాం!

సంతబొమ్మాళి : రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు అంతులేకుండాపోతోంది. అధికారం ఉండగానే వీలైనంత మేర దండుకునేందుకు చెలరేగిపోతున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయడంలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వారిని బెంబేలెత్తిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో చేపల కట్టు వేలంపాట విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీరు బీమారావు అధికారం అండతో పేట్రేగిపోయారు. కలెక్టర్, ఆర్డీఓపై పరుష వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌ వీపులు బద్దలు కొడతామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.సాక్షాత్తు పోలీసుస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వివరాలివీ.. మండలంలోని మూలపేట గ్రామంలో చేపల కట్టు వేలం పాట, ఇతర విషయాల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో వారు నౌపడ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడ టెక్కలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి సమక్షంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఊరికి, తమకు సంబంధంలేదని వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ జీరు బాబూరావు అంటున్నారని రేపు ఏం జరిగినా మీరు జోక్యం చేసుకోవద్దని భీమారావు పోలీసులను హెచ్చరించారు. సర్పంచ్‌ బాబూరావు లెక్కలు చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో.. మూలపేట పోర్టు నిర్మాణం నిమిత్తం గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రస్తావన వచ్చింది. దీంతో.. సర్పంచ్‌ ప్రతి విషయంలో కలగజేసుకుంటున్నాడని, పోర్టు నిర్మాణ నిమిత్తం మూలపేట గ్రామాన్ని ఖాళీ చేయించడానికి కలెక్టర్‌ వస్తే ఆయన వీపు బద్దలుకొడతామని పోలీసుల సమక్షంలో భీమారావు పరుషంగా మాట్లాడారు. ‘మేం మా­రం.. మా ఊరు వదలం.. పరిహారం డబ్బు­లు ఎవరికి ఇచ్చారని ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు’ అంటూ రెచ్చిపోయారు.పోర్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో 580 కుటుంబాలకు లాటరీ తీయకుండా.. ‘వాడెవడు 80 మందికి లాటరీ తీశాడం’టూ ఆర్డీఓపై విరుచుకుపడ్డారు. ‘గ్రామాన్ని ఖాళీ చేయడమేమిటి? అంతా మీ ఇష్టమా? ఇళ్లు, డబ్బులు ఎవరికిచ్చారం’టూ ప్రశ్నించారు. ‘పోలీస్‌స్టేషన్‌కు ఈరోజు 200 మంది వచ్చాం.. రేపు రెండువేల మందితో వస్తాం.. లెక్కలు చెప్పకపోతే చంపేస్తాం.. మీరు మాత్రం కేసు కట్టకండి’ అని పోలీసులను భీమారావు హెచ్చరించారు. ఇలా టీడీపీ నేతల తీరుతో మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు.. సర్పంచ్‌ బాబూ­రావు శనివారం లెక్కలు చెప్తారని పోలీసులు నచ్చజెప్పడంతో అంతా అక్కడి నుంచి నిష్క్రమించారు.

Punjab Kings vs Rajasthan Royals match today7
పంజాబ్‌ జోరు కొనసాగేనా!

ముల్లాన్‌పూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ 18వ సీజన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌... రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ‘డబుల్‌ హెడర్‌’లో భాగంగా శనివారం జరగనున్న రెండో పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత పదేళ్లుగా ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన పంజాబ్‌ జట్టు... ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ శిక్షణ, శ్రేయస్‌ అయ్యర్‌ కెపె్టన్సీలో తాజా సీజన్‌లో జోరు మీదుంది. మరోవైపు తొలి సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తిరిగి సత్తా చాటేందుకు రెడీ అయింది. ఆటేతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్న రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 29, 4 పరుగులు చేసిన జైస్వాల్‌... ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగిన సంజూ సామ్సన్‌... ఈ మ్యాచ్‌లో సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో వికెట్‌ కీపింగ్‌ చేసేందుకు బీసీసీఐ అతడికి అనుమతినిచ్చింది. జైస్వాల్, సామ్సన్, నితీశ్‌ రాణా, రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురేల్, హెట్‌మైర్, హసరంగతో రాయల్స్‌ బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. ఆర్చర్, తీక్షణ, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, శుభమ్‌ శర్మ బౌలింగ్‌ భారం మోయనున్నారు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన పంజాబ్‌ కింగ్స్‌... సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అటు విదేశీ హిట్టర్లు... ఇటు స్వదేశీ ప్లేయర్లతో పంజాబ్‌ పటిష్టంగా ఉంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ప్రియాంశ్‌ ఆర్య జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... శ్రేయస్‌ అయ్యర్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, యాన్సెన్‌తో మిడిలార్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. అర్ష్ దీప్ సింగ్‌తో కలిసి ఫెర్గూసన్, యాన్సెన్‌ పేస్‌ భారం మోయనుండగా... యుజ్వేంద్ర చహల్‌ స్పిన్‌ బాధ్యతలు చూసుకోనున్నాడు. పెద్ద బౌండరీలతో కూడిన ముల్లాన్‌పూర్‌ మైదానం స్పిన్‌కు అనుకూలించనుంది. గత సీజన్‌లో ఇక్కడ ఓ మాదిరి స్కోర్లే నమోదు కాగా... బౌలింగ్‌ బలంతోనే జట్లు విజయాలు సాధించాయి. తుది జట్లు (అంచనా) రాజస్తాన్‌ రాయల్స్‌: సామ్సన్‌ (కెప్టెన్ ), జైస్వాల్, రాణా, పరాగ్, జురేల్, హసరంగ, హెట్‌మైర్, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్, శుభమ్‌ దూబే. పంజాబ్‌ కింగ్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్ ), ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, సుర్యాంశ్, యాన్సెన్, ఫెర్గూసన్, అర్ష్ దీప్, చహల్, వైశాక్‌.

High demand for houses with EV charging facility8
ఈవీ ఇళ్లకు డిమాండ్‌.. ధరల పెరుగుదలా డబుల్‌!

ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్‌ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్‌ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్‌ పాయింట్‌ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది.2030 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ(రెట్రోఫిట్‌) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్‌ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. పెద్దస్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్‌ స్థలాన్ని ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్‌ఎల్‌ ఇండియా స్ట్రాటర్జిక్‌ కన్సల్టింగ్‌ అండ్‌ వాల్యువేషన్‌ అడ్వైజరీ హెడ్‌ ఏ.శంకర్‌ తెలిపారు.ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌(ఐఓటీ) చార్జింగ్‌ ఉపకరణాలు, ఇంటర్నెట్‌ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్‌ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్‌ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ఆఫీస్‌ స్పేస్‌లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్‌ స్పేస్‌లకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్‌ మోడల్‌ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్‌ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవటమే అసలైన సవాల్‌. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌ ప్లేస్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్‌ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్‌ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్‌ఎల్‌ సూచించింది.

Rasi Phalalu: Daily Horoscope On 05-04-2025 In Telugu9
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.అష్టమి రా.12.30 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.10.28 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.13 నుండి 11.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.34 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం: 6.10.మేషం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు నిరాశ.మిథునం: కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో చికాకులు. కళాకారులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.కన్య: పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితి.తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. పారిశ్రామికవేత్తల యత్నాలు మందగిస్తాయి. వృత్తులు, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.వృశ్చికం: శ్రమ ఫలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. దైవదర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.కుంభం: అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.మీనం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

US President Donald Trump Public image image down 43 percent10
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్‌ గ్రాఫ్‌ 

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు వడ్డించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రాఫ్‌ బాగా పడిపోయింది. ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించే అమెరికన్ల సంఖ్య 43 శాతానికి పడిపోయింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. మూడు నెలల కింద అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయనకు మద్దతు ఇంత తగ్గడం ఇదే తొలిసారి. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ట్రంప్‌కు 47 శాతం మద్దతు లభించింది. ట్రంప్‌ సుంకాలు, నిర్వహణపై అమెరికన్లు బాగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన విదేశాంగ విధానాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. వలసదారులను తిప్పి పంపుతున్న అంశంపై మాత్రమే ట్రంప్‌ విధానాలకు ఆమోదం తెలిపారు. ట్రంప్‌ పాపులారిటీ తగ్గడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరే. ఈ విషయంలో ఆయన పనితీరును కేవలం 37 శాతం మంది మాత్రమే ఆమోదించారు. ఆటోమొబైల్స్, ఆటోమోటివ్‌ విడిభాగాల వంటి వస్తువులపై ట్రంప్‌ విధించిన భారీ సుంకాలతో చాలామంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త టారిఫ్‌లు తమకు, తమ కుటుంబాలకు చేటు చేస్తాయని భావిస్తున్నట్లు సర్వేలో దాదాపు సగం మంది పేర్కొన్నారు. ట్రంప్‌ సుంకాల పెంపు స్టాక్‌ మార్కెట్లో కూడా అనిశ్చితికి దారితీయడం తెలిసిందే. ఆయన దుందుడుకు విధానాలు దీర్ఘకాలిక దౌత్య నిబంధనలకు విఘాతం కలిగించడమే గాక ప్రపంచంతో అమెరికా వ్యవహరించే విధానంలో మార్పుకు కారణమయ్యాయి. ట్రంప్‌ సైనిక నిర్వహణ పట్ల కూడా అమెరికన్లు బాగా ఆందోళన చెందుతున్నట్టు సర్వే తేల్చింది. యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై సైనిక దాడి ప్రణాళిక సిగ్నల్‌ యాప్‌ ద్వారా లీకవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ఇది తవ్ర బాధ్యతారాహిత్యమని ఏకంగా 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్‌ విదేశాంగ విధానానికి జనామోదం కూడా జనవరిలో 34 శాతానికి పడిపోయింది. జనవరిలో ఇది 37 శాతంగా ఉంది. ట్రంప్‌ వలస విధానాలకు 48 శాతం ఆమోదం లభించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement