ఏసీబీ అధికారులు వేధిస్తున్నారు: ఉదయసింహ
Published Mon, Aug 3 2015 12:08 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
హైదరాబాద్ : ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న ఉదయసింహ అన్నారు. ఆయన సోమవారం ఉదయం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయసింహ...' ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో నేర అంగీకార పత్రంపై బలవంతంగా సంతకం చేయాలని వేధిస్తున్నారని, తాను చెప్పిన అంశాలు కాకుండా ఏసీబీ ఇష్టానుసారంగా నేర అంగీకార పత్రాన్ని రూపొందించిదని' ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. కాగా కేసు తదుపరి విచారణ ఈనెల 14వ తేదీకి వాయిదా పడింది.
Advertisement
Advertisement