హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో నోటీసులు అందుకున్న టీడీపీ నేత ప్రదీప్, సుధీర్, మనోజ్, పుల్లారావు, రాఘవేందర్ రెడ్డి సోమవారం ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌కు ప్రదీప్ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.
మరోవైపు రేవంత్ రెడ్డి డ్రైవర్ రాఘవేందర్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద వీరందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఐదుగురు తెలుగు యువత నేతలకు కూడా ఓటుకు కోట్లు వ్యవహారంలో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.