ఓటుకు కోట్లు కేసులో వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ బుధవారం ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు మంగళవారం సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఏసీబీకి లభించిన ఆధారాలతో పాటు కస్టడీలో నిందితులు వెల్లడించిన అంశాల్లో కృష్ణకీర్తన్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మే 31న నామినేటెడ్ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్, ఉదయసింహలు కృష్ణకీర్తన్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, ఉదయసింహ, సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్యలను ఏసీబీ ప్రశ్నించింది.
Published Wed, Jul 15 2015 12:39 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement