'చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు'
తిరుపతి: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కైన సీఎం చంద్రబాబు ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఓటుకు కోట్లు కేసుతో తనకు ప్రమేయం లేదని చంద్రబాబు కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయగలరా? అని నవీన్కుమార్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలో బాబు జైలుకెళ్లడం తప్పదని జోస్యం చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.