ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారి సీఎం చంద్రబాబేనని నిర్ధారణయిందని మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు.
విశాఖపట్నం: ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారి సీఎం చంద్రబాబేనని నిర్ధారణయిందని మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. నిన్న వెలుగుచూసిన ఆడియో సంభాషణ ప్రపంచంలోనే సంచలనం అయిందని పేర్కొన్నారు.
ఇంతవరకు చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేదంటే రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతుందని శ్రీనివాస్ అన్నారు.