సాక్షి, హైదరాబాద్ : మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ.. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్.. లాంటి పదాలు వినగానే గుర్తొచ్చే సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఇంగ్లీష్‌లో ప్రసంగించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇంగ్లీష్‌పైనే కాకుండా వాయిస్‌పైన సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
చంద్రబాబు ప్రసంగం వింటూంటే ఓటుకు నోట్లు కేసు తాలుకూ ఇంగ్లీష్ మళ్లీ రిపీటైంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆ స్వరంతో అలాంటి ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి మరొకరులేరంటూ కామెంట్లు పెడుతున్నారు. వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ అని మూడేళ్ల క్రితం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన మాటలు, వాట్ ఆల్ హి స్పోక్... అంటూ హీరో శివాజీని ఉద్దేశించి ఇంగ్లీష్‌లో చంద్రబాబు చెప్పిన మాటలు అచ్చు ఒకేలా ఉన్నాయి అంటూ పోల్చి చూస్తున్నారు. రెండు వాయిస్‌లు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండటంతో .. ఎలా తప్పించుకుంటావ్ బాబూ ఆ ఇంగ్లీష్ మనదేగా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మూడేళ్ల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, అరెస్టు కావడం తెలిసిందే. స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందే చంద్రబాబునాయుడు ఆయనకు ఫోన్ చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రలోభాలకు గురిచేసిన ఆడియో అప్పట్లో సంచలనం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment