చంద్రబాబు, రేవంత్‌ నుంచి ప్రాణహాని | Jerusalem Mattaiah Says Life Threatening From Chandrababu And Revanth | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, రేవంత్‌ నుంచి ప్రాణహాని

Published Fri, Dec 11 2020 7:29 AM | Last Updated on Fri, Dec 11 2020 8:55 AM

Muttiah Says Life Threatening From Chandrababu And Revanth - Sakshi

సాక్షి, నాంపల్లి (హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు కోట్లుకేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన కు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు వివరించారు. ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డిలేనని చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా ఎంపీ రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  చదవండి: (అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement