ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌కు చుక్కెదురు | High Court Dismisses Revanth Reddy Petition regarding Vote For Note Case | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌కు చుక్కెదురు

Published Tue, Jun 1 2021 3:19 PM | Last Updated on Tue, Jun 1 2021 3:42 PM

High Court Dismisses Revanth Reddy Petition regarding Vote For Note Case - Sakshi

హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్‌ రేవంత్‌రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

ఆరేళ్లుగా విచారణ
2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement