
'ఓటుకు కోట్లు కేసులో టీ-సర్కార్ వేధిస్తోంది'
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని నిందితుడు మత్తయ్య ఆరోపించారు.
ఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని నిందితుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో రక్షించాల్సిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకొచ్చినా తనను బలిపశువును చేస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ పిటిషన్ వేయడంలో ఆంతర్యమేంటని మత్తయ్య ప్రశ్నించారు.
ఈ కేసులో స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. మత్తయ్యను రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.