Cash For Votes Case
-
మహారాష్ట్రలో క్యాష్ ఫర్ ఓట్స్ ఆరోపణలు
-
‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరిస్తూ విచారణ ముగించింది. అయితే.. ఈ కేసులో సీఎం, హోం మంత్రి జోక్యం చేసుకోవద్దంటూ మాత్రం ఆదేశాలిచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. అయితే.. కేసును విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది. ఏసీబీ డీజీ ప్రాసిక్యూషన్‌కు కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ కేసుపై సీఎం, హోం మంత్రికి రిపోర్ట్ చేయకండి. స్వతంత్ర, పారదర్శక విచారణ జరపాలనదే మా ఉద్దేశం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరపాలన్న వినతిని సైతం తిరస్కరించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలు: కవిత బెయిల్ పిటిషన్ కామెంట్లపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెపుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. క్షమాపణలు పబ్లిక్ గా చెప్పారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ తమ విధులు నిర్వహించాలి. రాజ్యాంగ వ్యవస్థలోని మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవం ఇవ్వాలి. కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్మాణాత్మక విమర్శలకు ఒకే కానీ లక్ష్మణ రేఖ దాటవద్దు. రేవంత్ రెడ్డి తరఫు వాదనలు 👇 కవిత బెయిల్ అంశంపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కు క్షమాపణ తెలిపిన రేవంత్ అది నా ట్విట్టర్ హ్యాండిల్ కాదు నేను అడ్మినిస్ట్రేటర్ కాదు నేను పీసీసీ అధ్యక్షుడిని కాదు ప్రాసిక్యూటర్ ను మార్చాలని, దీనికి పొలిటికల్ ట్విస్ట్ ఇస్తున్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరపు వాదనలు 👇 ఏసీబీ డీజీ సీఎం నియంత్రణలో ఉన్నాయి స్వతంత్ర వ్యవస్థ నుంచి ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు ఉండాలి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నుంచి మాత్రమే ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు అందాలి -
'ఓటుకు కోట్లు కేసులో టీ-సర్కార్ వేధిస్తోంది'
ఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని నిందితుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో రక్షించాల్సిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకొచ్చినా తనను బలిపశువును చేస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పిటిషన్ వేయడంలో ఆంతర్యమేంటని మత్తయ్య ప్రశ్నించారు. ఈ కేసులో స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. మత్తయ్యను రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
'ఓటుకు కోట్లు'లో ఏమీ లేదు: చంద్రబాబు
ఓటుకు కోట్లు కేసులో ఏమీ లేదని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను 'సాక్షి' ఈ విషయమై ప్రశ్నించినప్పుడు సాక్షిపై ఆయన తన అక్కసు వెళ్లగక్కారు. కొందరు తనపై ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాల్సిందేనని చెప్పారు. ప్రత్యేక హోదాపై స్పష్టత వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతానని అన్నారు. త్వరలోనే అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటిస్తానని తెలిపారు. ఇక తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై పోరాటం చేస్తానని కూడా ఆయన అన్నారు. -
‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుతో లాలుచి పడకుండా విచారణ చేయించాలని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును నీరు గార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చి గవర్నర్ ను కలవడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఓటుకు కోటు కేసులో నెల రోజుల్లో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. అస్సలు ఈ కేసు నిలవదని టీడీపీ నేతలు చెప్తుతున్నారు అదే సందర్భంలో ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడితో సుజనా చౌదరి భేటీ అయ్యారు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఉదయం సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు గవర్నర్ తో హడావుడిగా సమావేశమయ్యారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడానని సుజనా చెబుతున్నారు ప్రత్యేక హోదా రాజ్యాంగపరమైన అంశమా? ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? రాజ్‌భవన్ అను వ్యవస్థను... వ్యవస్థలానే ఉంచాలని కోరుతున్నాం రాజ్‌భవన్ గౌరవాన్ని దెబ్బతీయొద్దని కోరుతున్నాం రాజ్‌భవన్‌ను రాజీభవనంగా, లాలుచిభవనంగాచేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నర్ కు తెలంగాణ సీఎం ఏసీబీ డీజీ, అడ్వకేట్ జనరల్ బ్రీఫ్ చేస్తారు పరిపాలనలో భాగంగా వారు బ్రీఫ్ చేసివుండొచ్చు బీజేపీ అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రత్యేక హోదా అంశాన్ని చర్చిస్తే దాన్ని ప్రధానికి నివేదించాలి గానీ, గవర్నర్ కు చెప్తారా? ఓటుకు కోట్లు కేసులో బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తోందని చెప్పదలిచారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగానికి అతీతులమని చెప్పాలనుకుంటున్నారా? రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కేంద్రం, రాజ్‌భవన్ ఇలాంటి కార్యక్రమాలకు వేదిక కావడం సమంజసమా? కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టారని మొదట నుంచీ చెప్తున్నాం చంద్రబాబును ఎవరూ కాపాడలేరని చెప్పిన తెలంగాణ సీఎం ఎందుకు ముందుకు కదల్లేకపోతున్నారు? మొదటి చార్జిషీటులో చంద్రబాబు పేరు ఉన్నా ఆయనను ఎందుకు విచారించలేదు? సామాన్యులకు ఒక న్యాయం, సీఎంకు మరో న్యాయమా? రాజ్‌భవన్ లో ఏం జరిగిందో అధికారిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరముంది టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు అన్నిరోజులు మీవి కావని టీడీపీ నాయకులు, చంద్రబాబు గుర్తించాలి ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి -
‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’