‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్‌ చేయొద్దు’ | Cash for votes Scam Case: Big Relief To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్‌ చేయొద్దు’

Published Fri, Sep 20 2024 11:48 AM | Last Updated on Fri, Sep 20 2024 12:20 PM

Cash for votes Scam Case: Big Relief To CM Revanth Reddy

సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరిస్తూ విచారణ ముగించింది. అయితే.. ఈ కేసులో సీఎం, హోం మంత్రి జోక్యం చేసుకోవద్దంటూ మాత్రం ఆదేశాలిచ్చింది. 

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. అయితే.. కేసును విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. 

‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్‌ వేశారు. అందుకే ఈ పిటిషన్‌లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది. 

ఏసీబీ డీజీ ప్రాసిక్యూషన్‌కు కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ కేసుపై సీఎం, హోం మంత్రికి రిపోర్ట్‌ చేయకండి. స్వతంత్ర, పారదర్శక విచారణ జరపాలనదే మా ఉద్దేశం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరపాలన్న వినతిని సైతం తిరస్కరించింది సుప్రీంకోర్టు. 

సుప్రీంకోర్టు ఆదేశాలు: 

  • కవిత బెయిల్‌ పిటిషన్‌ కామెంట్లపై రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెపుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. 
  • క్షమాపణలు పబ్లిక్ గా చెప్పారు. 
  • రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ తమ విధులు నిర్వహించాలి. 
  • రాజ్యాంగ వ్యవస్థలోని మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవం ఇవ్వాలి. 
  • కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 
  • నిర్మాణాత్మక విమర్శలకు ఒకే కానీ లక్ష్మణ రేఖ దాటవద్దు. 

రేవంత్ రెడ్డి తరఫు వాదనలు 👇 
కవిత బెయిల్ అంశంపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కు క్షమాపణ తెలిపిన రేవంత్ 

  • అది నా ట్విట్టర్ హ్యాండిల్ కాదు 
  • నేను అడ్మినిస్ట్రేటర్ కాదు 
  • నేను పీసీసీ అధ్యక్షుడిని కాదు 
  • ప్రాసిక్యూటర్ ను మార్చాలని, దీనికి పొలిటికల్ ట్విస్ట్ ఇస్తున్నారు 

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరపు వాదనలు 👇 

  • ఏసీబీ డీజీ సీఎం నియంత్రణలో ఉన్నాయి 
  • స్వతంత్ర వ్యవస్థ నుంచి ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు ఉండాలి 
  • సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నుంచి మాత్రమే ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు అందాలి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement