
'ఓటుకు కోట్లు'లో ఏమీ లేదు: చంద్రబాబు
ఓటుకు కోట్లు కేసులో ఏమీ లేదని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను 'సాక్షి' ఈ విషయమై ప్రశ్నించినప్పుడు సాక్షిపై ఆయన తన అక్కసు వెళ్లగక్కారు. కొందరు తనపై ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాల్సిందేనని చెప్పారు. ప్రత్యేక హోదాపై స్పష్టత వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతానని అన్నారు. త్వరలోనే అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటిస్తానని తెలిపారు. ఇక తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై పోరాటం చేస్తానని కూడా ఆయన అన్నారు.