
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్‌ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసింది. నియామకానికి సంబంధించిన ప్రతిపాదనకు గవర్నర్ నరసింహన్‌కు ఆమోదం తెలిపారు. అనంతరం ఆ ప్రతిని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి పంపారు.
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్ నియామానికి ఆమోదం తెలుపుతూ సీఈఓ రజత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం తెలంగాణ తొలి మంత్రివర్గ సమావేశం జరగింది. సమావేశంలో హోంమంత్రి మహ్మద్ అలీ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటే నామినేటెడ్ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది.
తెలంగాణ శాసనసభ స్థానాలు 120. ఇందులో 119 మంది ఎన్నికల ద్వారా వస్తారు. మిగిలిన స్థానంలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నియమిస్తారు. గత ప్రభుత్వంలో కూడా స్టీఫెన్‌సన్ ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడిగా నియమించబడ్డారు. ఆ సమయంలో ‘ఓటుకు నోటు’ ఉదంతం జరిగింది.