Anglo indian
-
ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు? వీరి ప్రాధాన్యత ఏమిటి?
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం ఉండేది. లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను రాష్ట్రపతి స్వయంగా ఎన్నుకునేవారు. సభలో ఈ సంఘానికి రెండు సీట్లు రిజర్వ్ చేసేవారు. పార్లమెంట్లో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. దేశంలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ చరిత్ర గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (2)లో ఆంగ్లో ఇండియన్ ప్రస్తావన కనిపిస్తుంది. ఆంగ్లో-ఇండియన్ అంటే భారతదేశంలో నివసిస్తూ, వారి తండ్రి లేదా అతని తండ్రితరపు పూర్వీకులు యూరోపియన్ సంతతికి చెందినవారై ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలో ఆంగ్లో-ఇండియన్ల రాక బ్రిటీష్ వారు భారతదేశంలో రైల్వే ట్రాక్‌లు,టెలిఫోన్ లైన్లు వేసినప్పుడు ప్రారంభమైంది. ఈ పనుల కోసం యూరప్ నుండి జనం భారతదేశానికి తరలి వచ్చారు. తర్వాత ఇండియాలో ఇక్కడి యువతులనే వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం.. భారతదేశంలోని ఆంగ్లో-ఇండియన్ల సంఘం ప్రతినిధులను దేశంలోని పార్లమెంటు, రాష్ట్రాలలోని అసెంబ్లీలకు నామినేట్ చేసేవారు.ఈ సంఘానికి సొంత నియోజకవర్గం అంటూ లేదు. ఈ హక్కును తొలిసారిగా ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఫ్రాంక్ ఆంథోనీ అందుకున్నారు. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు ఉన్నాయి. వీటికి 543 మంది ఎంపీలు ఎన్నికవుతారు. ఈ ఎంపీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు ఎవరూ లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం, రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ సంఘానికి చెందిన ఇద్దరు ప్రతినిధులను లోక్‌సభకు నామినేట్ చేసేవారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం సభకు నామినేట్ అయిన ఆంగ్లో-ఇండియన్ 6 నెలల్లోపు ఏదైనా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న తర్వాత వారు ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలి. దీనితో పాటు పార్టీ నియమనిబంధనల ప్రకానం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు? రాష్ట్రాలలో ఏ ఆంగ్లో ఇండియన్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలవని పక్షంలో గవర్నర్ ఆంగ్లో-ఇండియన్‌ను ఎన్నుకుని అసెంబ్లీకి పంపే హక్కు కలిగి ఉంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రజల నుంచి ఎన్నుకోనివారై, రాష్ట్రపతి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయితే వారికి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కు వారికి ఉండదు. 2012 రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసిన ఏకైక ఆంగ్లో-ఇండియన్ డెరెక్ ఓ బ్రియన్. ఈయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎంపికయ్యారు. ఆదరణ పొందిన కీలర్ సోదరులు పలువురు ఆంగ్లో-ఇండియన్లు మనదేశంలో ఆదరణ పొందారు. వారిలో కీలర్ సోదరులు ప్రముఖంగా కనిపిస్తారు. వీరిద్దరూ లక్నోలో పుట్టారు. ఎయిర్ ఫీల్డ్ మార్షల్ డెంజిల్ కీలర్, వింగ్ కమాండర్ ట్రెవర్ కీలర్ భారత వైమానిక దళంలో పని చేశారు. వీరు ప్రదర్శించిన ధైర్యసాహసాల కారణంగా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరిద్దరికీ వీర చక్ర అవార్డు లభించింది. లక్నోలో చదువుకున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆల్ఫ్రెడ్ కుక్ కూడా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీర చక్ర అవార్డును అందుకున్నారు. పీటర్ ఫాంథమ్ పలుమార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వ నిర్ణయంతో.. మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ సమయంలో, ఆంగ్లో ఇండియన్ల ఎంపిక విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. 2019 సంవత్సరంలో పార్లమెంటులో ఆంగ్లో-ఇండియన్ల ప్రాతినిధ్యాన్ని రద్దు చేసింది. ప్రతి పదేళ్ల తర్వాత పార్లమెంటులో రిజర్వేషన్లకు సంబంధించి సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో ఈ రెండు రిజర్వ్డ్ సీట్లలో రిజర్వేషన్ ఉంచాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. వారి రిజర్వేషన్ వ్యవధి 2020, జనవరి 25తో ముగిసింది. రాజ్యాంగంలో 126వ సవరణ సమయంలో జరిగిన సమీక్ష సందర్భంగా ఈ రిజర్వేషన్‌ను కొనసాగించకూడదని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో జార్జ్ బేకర్, రిచర్డ్ హే.. ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుండి పార్లమెంటుకు ఎంపికైన చివరి ఎంపీలుగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఆమె మన దేశపు రాకుమారి.. పాక్ ప్రభుత్వంలో పనిచేస్తూ.. -
అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు!
మన జీవితాన్ని మనం రాసుకుంటామా? మరెవరైనా రాస్తారా? యాగ్నెస్ నుదుటిన మదర్ థెరిసా అనే మకుటాన్ని చేర్చింది ఎవరు? అనుకోకుండా ఓ రోజు... నిర్మల అనే యువతి నలుగురు పిల్లలకు అమ్మ కావాలని రాసింది ఎవరు? యాభై ఏళ్లు వచ్చే లోపే డెబ్బై మంది పిల్లలకు తల్లయింది గూడపాటి నిర్మల. మరో ముగ్గురు పాపాయిలకు అమ్మమ్మ కూడా. గుడివాడలో పుట్టిన నిర్మలది ఆంగ్లో ఇండియన్ నేపథ్యం ఉన్న కుటుంబం. హైదరాబాద్, మోతీనగర్‌లో జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్‌లో నలభై మంది పిల్లలతో సాగుతోంది ఆమె జీవితం. అమ్మకు వైద్యం కోసం 2006లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఊహకు కూడా అందని విషయం ఇది. అలాంటి ఏ మాత్రం ఊహించని విషయాలు తన జీవితంలో ఎన్నో జరిగాయన్నారు నిర్మల. తాను ఒక డైరెక్షన్ అనుకుంటే తన ప్రమేయం లేకుండా ఏదో ఓ సంఘటన తన మార్గాన్ని మలుపు తిప్పుతూ వచ్చిందని చెప్పారామె. నాటి రైలు ప్రయాణం ‘‘అమ్మానాన్నలు స్కూల్ హెడ్మాస్టర్లు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయిని. ఇంటర్ తర్వాత లా చదవాలనేది నా కోరిక. అయితే ఆ సెలవుల్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ సంఘటన... నా తోటి ప్రయాణికులు మాతోపాటు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు లెప్రసీ పేషెంట్లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫామ్ మీదకు తోసేశారు. ‘అదేంటి, అలా చేశారు’ అని అడిగితే ‘ఇదెవత్తో పిచ్చి పిల్లలా ఉంద’ని నన్ను ఈసడించుకున్నారు కూడా. అప్పటికి నాకు లెప్రసీ అంటే ఏమిటో తెలియదు. ఇంటికి వెళ్లి మా తాతయ్యను అడిగినప్పుడు వాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పారాయన. అప్పుడు డిగ్రీకి చెన్నైకి వెళ్లి లెప్రసీ సంబంధిత కోర్సు చేశాను. అలాగే టీబీ, హెచ్ఐవీ నిర్మూలన సర్వీస్ కోర్సులు చేశాను. అమ్మ కోసం హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఓ ఆంగ్లో ఇండియన్ ఎంఎల్ఏ సూచనతో బోరబండ, పర్వత్ నగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో సర్వీస్ మొదలు పెట్టాను. ఓ రోజు మాదాపూర్‌లో మాణింగ్ వాక్ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఓ దుర్ఘటన. ఓ తల్లిదండ్రులు ఆటో స్టాండ్ దగ్గర లగేజ్‌తో ఉన్నారు. వాళ్ల నలుగురు పిల్లల్ని అప్పుడే రోడ్డుకు ఒక పక్కగా ఉంచి, తల్లిదండ్రులు సామాను ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఇంతలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఓ లారీ... రాంగ్‌సైడ్ వచ్చి వాళ్లను ఢీకొట్టింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు వచ్చారు. అంటే... నలుగురు చిన్న పిల్లల అమ్మమ్మ – తాత, నానమ్మ –తాతలన్నమాట. వాళ్లు ఆ పిల్లలను చూస్తూ ‘నష్టజాతకులు’ అని ఓ మాట అనేసి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. లెప్రసీ కాలనీ సర్వీస్‌తో అప్పటికే ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు పరిచయం అయ్యారు. వారు ఆ పిల్లలను స్టేట్ హోమ్‌లో చేర్చే బాధ్యత నాకప్పగించారు. నలుగురు పిల్లలకు గార్డియన్‌గా నేనే సంతకం చేసి స్టేట్‌హోమ్‌లో చేర్చాను. అయితే... ఆ బాధ్యత అంతటితో తీరలేదు. స్టేట్ హోమ్ నుంచి ఫోన్ కాల్ ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లైన్లో ఉంది. ‘అమ్మా! మమ్మల్ని హోమ్‌లో చేర్చేటప్పుడు మీరు సంతకం చేశారట. హోమ్ వాళ్లు మమ్మల్ని బయటకు పంపించాలన్నా కూడా మీరే సంతకం చేయాలట. మీరు వచ్చి సంతకం చేస్తే మేము బయటకు వెళ్లిపోతాం. ఇక్కడ ఉండలేం’ ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఎక్కడికి వెళ్తారు. నీకు పదేళ్లు కూడా లేవు. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లికి ఏడాది కూడా నిండలేదు. వాళ్లను నువ్వు ఎలా చూసుకుంటావని అడిగితే సమాధానం లేదు. ‘ఎక్కడికో ఒక చోటకు వెళ్లిపోతాం, ఇక్కడ మాత్రం ఉండలేం’ అదే మంకుపట్టు. అప్పుడు పోలీసుల నుంచి ఓ రిక్వెస్ట్. ఆ పిల్లలను మీరు సంతకం చేసి బయటకు తీసుకురాకపోతే గోడదూకి వెళ్లిపోతారు. ఆ పోవడం రోడ్డు మీదకే. సిగ్నళ్ల దగ్గర బెగ్గర్‌గా మారిపోతారు. వాళ్లను దగ్గర పెట్టుకుని చదివించే మార్గం చూడమన్నారు. దాంతో వాళ్లను మా ఇంటికి తీసుకువచ్చాను. ఆలా ఆ రోజు నలుగురు పిల్లలకు అమ్మనయ్యాను. చంటిబిడ్డను చూసుకోవడానికి మా ఊరి నుంచి ఒక డొమెస్టిక్ హెల్పర్‌ను పిలిపించుకున్నాను. ఆ తర్వాత పోలీసుల నుంచి తరచూ ఓ ఫోన్. అమ్మానాన్నలకు దూరమైన పిల్లల్లో పోలీసుల దృష్టికి వచ్చిన వాళ్లను తెచ్చి వదిలిపెట్టసాగారు. అలా మూడు నెలలకు నా ఇల్లు ఇరవై మంది పిల్లల ఇల్లయింది. అంతమంది పిల్లలను ఇంట్లో ఉంచడానికి ఇంటి ఓనరు అభ్యంతరం చెప్పడంతో పూర్తి స్థాయి హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు మా హోమ్ నుంచి మొత్తం డెబ్బై మంది పిల్లలు సహాయం పొందుతున్నారు. నలభై మంది ఈ హోమ్‌లో ఉన్నారు. పన్నెండు మంది అబ్బాయిలు విజయవాడలో ఉన్నారు. ఎనిమిది మంది సెమీ ఆర్ఫన్లకు ఈ హోమ్ నుంచే భోజనం వెళ్తుంది. వాళ్లకు తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెకు తన పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి శక్తి లేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, భోజనం, దుస్తులు అన్నీ మా హోమ్ చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఉదయం వాళ్ల ఇంటి నుంచి స్కూలుకు వస్తారు, రాత్రికి తల్లి దగ్గరకు వెళ్లిపోతారు. ఇక కాలేజ్‌కెళ్లే వాళ్ల విషయానికి వస్తే... ఎనిమిది మంది ఇంటర్, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై మంది నర్సింగ్, పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఐదుగురు కర్నాటకలో మెడిసిన్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉన్నారు. మొదట నేను ఇంటికి తెచ్చుకున్న ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి, సంతకం చేస్తే వెళ్లిపోతానని ఫోన్ చేసిన అమ్మాయి కూడా ఇప్పుడు కర్నాటకలో మెడిసిన్ చేస్తున్న వాళ్లలో ఉంది. మా పిల్లల్లో ముగ్గురు పూనా, వైజాగ్, బెంగళూరుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక్కొక్కరూ నలుగురు పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్లు ముగ్గురూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రసవాలు కూడా మా హోమ్‌లోనే. ఆ పిల్లలు నన్ను ‘అమ్మమ్మ’ అంటారు. ఆ చిన్న పిల్లలకు నలభై మంది పిన్నమ్మలు. మాది జగమంత కుటుంబం’’ అన్నారు నిర్మల తన పిల్లల మధ్య కూర్చుని వాళ్లను ముద్దు చేస్తూ. నిర్మల ఆఫీసు గదిలో గోడకు మదర్ థెరిసా ఒక బిడ్డను ఎత్తుకున్న ఫొటో ఉంది. ఈ మదర్... చుట్టూ పిల్లలతో ఆ మదర్‌కు మరోరూపంగా కనిపించింది. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లకు కండిషన్లుంటాయి. వాళ్లను ఉద్యోగం మాన్పించకూడదు. పెళ్లికి ముందే కొంత మొత్తం అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. అనాథ అని సంబోధించరాదు. అలాగే తమ అభ్యుదయ భావాలను సమాజం ముందు ప్రదర్శించుకోవడానికి ‘అనాథను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పుకోరాదు. పాట నడిపేది నేను సింగర్‌ని. పాటలు పాడడం ద్వారా మంచి రాబడి ఉండేది. దాంతో హోమ్ నడపడం ఏ మాత్రం కష్టం కాలేదప్పట్లో. థైరాయిడ్ సమస్యతో గొంతుకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పాడలేను. ప్రధాన ఆదాయ వనరు ఆగిపోయింది. పిల్లలకు దుస్తులు, భోజనం వరకు ఇబ్బంది లేదు. మా హోమ్‌ని చూసిన వాళ్లు వాటిని విరాళంగా ఇస్తుంటారు. బర్త్‌డేలు మా పిల్లలతో కలిసి చేసుకోవడం కూడా మాకు బాగా ఉపకరిస్తోంది. స్కూలు, కాలేజ్ ఫీజులు, ఇంటి అద్దెకు మాత్రం డబ్బుగా కావాల్సిందే. డబ్బుగా ఇస్తే దారి మళ్లుతుందేమోననే సందేహం ఉంటుంది. నేను అభ్యర్థించేది ఒక్కటే. నా చేతికి డబ్బు ఇవ్వవద్దు. ఈ పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం, స్కూల్కెళ్లి ఫీజులు చెల్లించడం స్వయంగా వారే చేయవచ్చు. ఏడాది పాటు ఒక బిడ్డను చదివించవచ్చు. మనసుంటే మార్గాలూ ఉంటాయి. – గూడపాటి నిర్మల, జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
మార్కస్‌బార్‌ట్లే: చంద్రుడిని చూపినవాడు
‘గుండమ్మ కథ’లో అక్కినేనికి, జమునకు పెళ్లవుతుంది. తొలిరాత్రి. డాబా మీద వధువు, వరుడు చేరారు. రాత్రి బాగుంది. కొబ్బరాకుల మీద నుంచి వీచే గాలి బాగుంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు సరే... ఏం మాట్లాడుకుంటారు. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. తెల్లగా, చల్లగా, నిండుగా ఉన్నాడు. అతన్ని మధ్యవర్తిగా తెచ్చుకుంటే పోదా... పాట మొదలవుతుంది. ‘ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తుమందు చల్లగా’... ప్రేక్షకులూ వారిద్దరితో పాటు చందమామను చూస్తారు. చందమామతో కలిసి పాడతారు. చందమామను గుర్తు పెట్టుకుంటూ ఇంటికెళ్లి తమ డాబా మీద కూడా దానిని దించొచ్చేమోనని చూస్తారు. అది చందమామ మహాత్యమా? కాదు. సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే మహత్యం. తెలుగువారికి చంద్రుణ్ణి, పున్నమిని, వెన్నెలను, చల్లదనాన్ని ఇచ్చి మబ్బుల్లోకి చేరిన భావుకుడైన సినిమాటోగ్రాఫర్ ఆయన. ‘విజయా’ సంస్థలో సుదీర్ఘంగా పని చేసి, పని చేసిన ప్రతి సినిమాలోనూ చంద్రుణ్ణి స్టూడియోలోకి దించిన ఘనుడు. అందుకే చందమామను తెలుగువారు విజయావారి చందమామ అని కూడా అంటారు. జగతిలో నిజం చందమామ కంటే ఈ విజయావారి చందమామే బాగుంటాడు. మార్కస్ బార్ట్లే ఆంగ్లో ఇండియన్. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో కెమెరా పట్టుకుని ప్రయోగాలు చేసి పెద్దయ్యాక సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. ట్రిక్ ఫొటోగ్రాఫీలో ఆయన జీనియస్. పాతాళభైరవి, మాయాబజార్‌లలో ఆయన విశ్వరూపం భారతదేశంలో మరెవరికీ సాధ్యం కానిది. కాని అవన్నీ ఆబాలగోపాలం వినోదానికి. కాని రస హృదయం కలిగిన స్త్రీ, పురుషులందరికీ ఆయన సేద ప్రసాదించినది తన చందమామతోనే. వీలున్న ప్రతిపాటలో ఆయన నిండు చందమామను చూపించేవాడు. శాంతం కలిగించేవాడు. ‘పాతాళభైరవి’లో ‘ఎంత ఘాటు ప్రేమయో’ డ్యూయెట్ చూడండి. రాజమహల్లో మాలతి పాడుతూ ఉంటుంది. నిండు చందురూడు వేళ్లాడుతున్న ఉద్యానవనంలో ఎన్.టి.ఆర్. ‘ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా’... అని జాబిల్లితో ఎన్.టి.ఆర్ నివేదించుకోవడం బార్ట్లే అందుకు తగ్గట్టుగా చందమామను సెట్ చేయడం... అద్భుతం. ‘మిస్సమ్మ’ కథంతా చందమామే. ‘ఏమిటో ఈ మాయా’ పాటలో, ‘బృందావనమది అందరిది’ పాటలో చందురుడి అందమే అందం. ఆపై అదే సినిమాలో ‘రావోయి చందమామా’ అనే పాట మార్కస్ బార్టే›్ల చంద్రుడి కోసమే పుట్టింది. అసలు ఈ చంద్రుడే లేకుంటే వీళ్లందరి విరహాలు, వేడుకోళ్లు ఎలా తీరేవా అని. ‘జగదేకవీరుని కథ’లో బి.సరోజా ‘హలా’ అని చంద్రుడికి హలో చెప్పగా ఎన్.టి.ఆర్ పక్కన చేరగా ‘అయినదేదో అయినది ప్రియ గానమేదే ప్రేయసి’ పాట మొదలైతే చూడాలి ఆ పోటీ... ఎన్.టి.ఆర్ అందమా, సరోజా దేవి చందమా, చంద్రుడి చందనమా. ఇక ‘మాయాబజార్’దే కదా అసలు కథంతా. ఆ సినిమా అంతా ఎన్నోసార్లు చంద్రుడు కనిపిస్తాడు. ‘నీ కోసమే నే జీవించునది’ పాటలో చందమామలో ఏకంగా శశిరేఖనే చూస్తాడు అభిమన్యుడు. అసలు రెల్లు పొదల చాటు నుంచి ఉదయించిన చంద్రుడు ద్యోతకమవుతుండగా, నీటి అద్దంపై అతగాడి ప్రతిబింబం పడుతూ ఉండగా, నౌకాయానానికి బయలుదేరిన శశిరేఖను, అక్కినేనిని చంద్రుడు ఎంత ప్రేమగా తల నిమిరాడని. ఎంత అక్కరగా లాలించాడని. మార్కస్ బార్ట్లే మహిమ వల్ల శ్రీకృష్ణుడు, రుక్మిణి సరే బలరాముడు, రేవతి కూడా ముచ్చటగొలుపు తారు. మార్కస్ బార్ట్లే గొప్పవాడని సినీ అభిమానులకు తెలుసు. ఆయనను చాలా ఇష్టంగా తలుచుకుంటారు. ఎప్పుడు ఆకాశాన పూర్ణ చంద్రుడు కనిపించినా ‘అదిగో విజయావారి చందమామ’ అని ఆయనకు నివాళులు అర్పిస్తారు. మార్కస్ బార్ట్లే 1993లో మద్రాసులో మరణించారు. -
పోలీసుల సర్టిఫికేట్; గ్లెన్బ్రిగ్స్తో చెట్టాపట్టాల్
విందులు.. వినోదాలు.. నజరానాలు.. ఆతిథ్యాలు.. పైరవీలు.. పోలీసులతో ఓ నకిలీ సర్టిఫికెట్ల దొంగ నెరిపిన సత్సంబంధాలు కోకొల్లలు. ఒంటిపై 70 తులాల బంగారం.. తిరుపతిలో విలాసవంతమైన భవనం.. చేతిలో పోలీసులు.. చెలరేగిపోయాడీ ఆంగ్లో ఇండియన్. దొంగలతో చేయి కలిపితే జైలుకెళ్లడం తప్పితే ఏముంటుందని.. ఏకంగా పోలీసులనే తన బుట్టలో వేసుకున్నాడు. వాళ్ల అవసరాలు తీరుస్తూ.. తన వ్యవహారాలను చక్కబెట్టుకున్న తీరుకు పోలీసు ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. చిన్నాచితక స్థాయిలో కాకుండా ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ కేటుగాని మాయలో పడటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, అనంతపురం : నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరితేరిన గ్లెన్ బ్రిగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తుండగా.. ఇందులో పోలీసులకు కూడా భాగస్వామ్యం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలోని నలుగురు డీఎస్పీలు ఈయనతో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. విందులు, వినోదాల్లో పాల్గొనడంతో పాటు నజరానాలు కూడా అందుకున్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఓ విభాగంలో పనిచేసే డీఎస్పీతో పాటు మూడు సబ్ డివిజన్లకు చెందిన ముగ్గురు డీఎస్పీలు గ్లెన్ బ్రిగ్స్‌తో కలిసి విందులు చేసుకుని.. పోస్టింగుల కోసం పైరవీలు చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు నేరస్తుడి నుంచి బైకులు, ల్యాప్‌టాప్‌లను కూడా కొంతమంది పోలీసులు నజరానాగా పొందినట్టు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలోని ఒక ఎస్ఐకి ల్యాప్‌టాప్ నజరానాగా అందించి కావాల్సిన పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో తనదైన శైలిని గ్లెన్ కనబరిచారని.. తరగతుల వారీగానే కాకుండా యూనివర్సిటీల వారీగా ప్రత్యేక ఫైళ్లను తయారు చేసుకుని ఇంట్లో భద్రపరచుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడా అనుమానం రాకుండా సదరు బోర్డు లేదా యూనివర్సిటీ ఇచ్చే ఒరిజినల్ సరి్టఫికెట్లలాగై తయారు చేయడమే కాకుండా సరి్టఫికెట్‌కు ఇచ్చే సిరీస్‌ను కూడా అదే క్రమంలో ఉంచి అనుమానం రాకుండా తయారు చేశారని విచారణలో తేలింది. మరోవైపు గుంతకల్లులోని అప్పటి అధికార పార్టీ నేత ద్వారా పైరవీ చేసి ఓ డీఎస్పీతో పాటు పలువురు పోలీసులకు పోస్టింగ్‌లు ఇప్పించినట్టు కూడా తెలుస్తోంది. బెయిల్ ఇప్పిస్తామంటూ.. కేవలం నకిలీ సరి్టఫికెట్ల తయారీతో ఆగిపోకుండా ఏకంగా కోర్టులో బెయిల్ ఇప్పిస్తానని కూడా గ్లెన్ డబ్బు వసూలు చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఒక హత్య కేసులో నిందితునికి ఈ విధంగానే బెయిల్ వచ్చేలా మధ్యవర్తిగా ఉండి రూ.30 లక్షలు ఇప్పించి పని కానిచ్చారని సమాచారం. ఈ వ్యవహారంలో కూడా పోలీసులు కొన్ని వివరాలు సేకరించి.. నివేదికను తయారుచేసి కోర్టు ముందు ఉంచనున్నట్టు సమాచారం. తిరుపతి కేంద్రంగా.. తిరుపతిలోని తన ఇల్లు కేంద్రంగా గ్లెన్ పోలీసులతో సత్సంబంధాలు నెరిపినట్లు తెలుస్తోంది. అక్కడికి ఏదైనా డ్యూటీకి వెళ్లిన పోలీసులకు తన ఇంట్లోనే ఆతిథ్యం ఇవ్వడంతో పాటు భారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేసేవాడు. తద్వారా జిల్లాలోని నలుగురు డీఎస్పీలతో పాటు సుమారు 10 మంది సీఐల వరకు తన గుప్పిట్లో పెట్టుకుని కావాల్సిన వ్యవహారాలు నడిపినట్టు తెలుస్తోంది. లోతుగా విచారణ పవర్ బ్రోకర్‌గా వ్యవహరించి పోలీసులకు నజరానాలు ఇస్తూ తన పనులు కానిచ్చుకోవడం ద్వారా గ్లెన్ భారీగా ఆర్జించినట్టు తెలుస్తోంది. ఏకంగా తన ఒంటిపై 70 తులాల బంగారం ధరించడమే కాకుండా తిరుపతిలో భారీగా పొలాలు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయనుండటంతో ఎవరెవరి జాతకాలు బయటకొస్తాయోననే అంశంపై పోలీసుశాఖలో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో గ్లెన్‌కు సంబంధించి నకిలీ సరి్టఫికెట్ల తయారీలోనూ పోలీసులకు సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. అంతేకాకుండా సదరు పోలీసులతో జరిపిన వాట్సాప్ చాట్ వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్లెన్ ఇంట్లో కానిస్టేబుల్ ఫొటో వాస్తవానికి ఆంగ్లో ఇండియన్ అయిన గ్లెన్ బ్రిగ్స్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అసహజ లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు ఇష్టపడే వాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంతకల్లులోని ఒక పోలీసు కానిస్టేబుల్‌తో అసహజ లైంగిక సంబంధాలు నెరిపినట్టు సమాచారం. అంతేకాకుండా సదరు కానిస్టేబుల్ ఫొటోను ఏకంగా తిరుపతిలోని తన ఇంట్లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సదరు కానిస్టేబుల్‌కు అవసరమైనవన్నీ ఈయనే సర్దుబాటు చేసేవారని కూడా విచారణలో తేలినట్టు సమాచారం. మరో కానిస్టేబుల్‌కు కూడా బైకు ఇవ్వడమే కాకుండా నిరంతరం అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కారును కొద్ది మంది పోలీసులకు ప్రొటోకాల్ వాహనంగా కూడా వినియోగించారని.. ఇందులో భాగంగా వాహనంపై పోలీసు వెహికల్ బోర్డు కూడా పెట్టుకుని చక్కర్లు కొట్టినట్టు తేలింది. -
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా మళ్లీ ఆయనే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసింది. నియామకానికి సంబంధించిన ప్రతిపాదనకు గవర్నర్ నరసింహన్‌కు ఆమోదం తెలిపారు. అనంతరం ఆ ప్రతిని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి పంపారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్ నియామానికి ఆమోదం తెలుపుతూ సీఈఓ రజత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం తెలంగాణ తొలి మంత్రివర్గ సమావేశం జరగింది. సమావేశంలో హోంమంత్రి మహ్మద్ అలీ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటే నామినేటెడ్ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ శాసనసభ స్థానాలు 120. ఇందులో 119 మంది ఎన్నికల ద్వారా వస్తారు. మిగిలిన స్థానంలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నియమిస్తారు. గత ప్రభుత్వంలో కూడా స్టీఫెన్సన్ ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడిగా నియమించబడ్డారు. ఆ సమయంలో ‘ఓటుకు నోటు’ ఉదంతం జరిగింది. -
ఆంగ్లో–ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్ని అడ్డుకోండి
యశవంతపుర: కర్ణాటక విధానసభకు ఆంగ్లో ఇండియన్ వినీషా నీరోను నామినేట్ చేస్తూ గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్–జేడీఎస్‌లు గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. యడ్యూరప్ప అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునే వరకూ గవర్నర్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని తమ పిటిషన్లో పేర్కొన్నాయి. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై దాఖలైన పిటిషన్‌తోపాటుగా నేడు ఈ పిటిషన్ సుప్రీంలో విచారణకు రానుంది. గురువారం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆంగ్లో–ఇండియన్‌ను గవర్నర్ నామినేట్ చేశారు. గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకు జెఠ్మలానీ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే తరహా పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. -
కర్ణాటక గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బల పరీక్ష పూర్తి కాకముందే ఓ ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్ చేశారు. దీంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి పెరగ్గా.. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ‘కర్ణాటక అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్ వజుభాయ్ వాలా నామినేట్ చేశారు. కానీ, బీజేపీ అభ్యర్థి యెడ్యూరప్ప ఇంకా బలాన్ని నిరూపించుకోలేదు. అంతలోనే గవర్నర్ ఇలా ఎమ్మెల్యేని నామినేట్ చేయటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి బల పరీక్ష పూర్తయ్యేదాకా అది చెల్లకుండా ఆదేశాలివ్వండి’ అంటూ సంయుక్త పిటిషన్లో కాంగ్రెస్-జేడీఎస్‌లు విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉంటే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో గత రాత్రి వాదనలు జరిగాయి. పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామన్న బెంచ్.. యెడ్డీ ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని, గవర్నర్ విచక్షణ అధికారాలను ప్రశ్నించలేమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను.. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేట్ పిటిషన్‌తో కలిపి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. (సుప్రీం కోర్టులో అర్ధరాత్రి హైడ్రామా) మా ఎమ్మెల్యేలు లొంగరు: నటి రమ్య -
కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి: రేవంత్
లేకుంటే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం: రేవంత్ సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్లా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కె.తారక రామారావుపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘నిండు సభలో టీడీపీ సభ్యులను ఆంగ్లో ఇండియన్ అని అనడం ద్వారా కేటీఆర్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్పీకర్ సభ్యులందరికీ సభాపతి. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఆయన పై ఉంది’ అని చెప్పారు. కేటీఆర్‌కు అబద్ధాలు చెప్పడం సాధారణమై పోయిందన్నారు. -
అంగ్లో ఇండియన్‌కు మరో ఎమ్మెల్యే పోస్టు..