ఓ స్టార్ హీరో తనను వాడుకుని వదిలేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది అమెరికన్ సింగర్, నటి జెస్సికా సింప్సన్. తనతో రహస్య సంబంధం పెట్టుకున్న అతడు ఆ సమయంలో బయటకు మాత్రం సింగిల్‌గానే ఉన్నట్లు చెప్పుకునేవాడని పేర్కొంది. 'మూవీ స్టార్: దె ఆల్వేస్ సే దె ఆర్ సింగిల్' వ్యాసంలో తన అనుభవాన్ని ఏకరువు పెట్టింది నటి.
'మ్యూజిక్ వీడియో అవార్డుల ఫంక్షన్‌లో హాలీవుడ్‌లోని ఓ మెగాస్టార్ నన్ను ఓరగా చూశాడు. కళ్లతోనే దోబూచులాడాడు. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్‌లో జిమ్‌లో మరోసారి మేమిద్దరం కలిశాం. అప్పుడు అతడిని నా మ్యూజిక్ వీడియోలో నటించమని అడిగాను. మనం అడగ్గానే ఒప్పుకుంటున్నారని మురిసిపోవద్దు. దాన్ని వాళ్లు అవకాశంగా తీసుకుంటారు. తర్వాత మనల్ని మోసం కూడా చేస్తారు. ఇది చాలా ఆలస్యంగా తెలుసుకున్నా.
నాపై ముద్దుల వర్షం కురిపించిన అతడు మరో ప్రియురాలితో కలిసి రెడ్ కార్పెట్‌పై కనిపించడంతో నా గుండె ముక్కలయ్యింది. మా బంధం ముగిసిపోయిందని అర్థమైంది. నాకు నేను కాల్ గర్ల్‌లా అనిపించాను. హాలీవుడ్‌లో ఒక్క భార్య/గర్ల్‌ఫ్రెండ్ చాలు అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారని అప్పుడే తెలిసొచ్చింది' అని రాసుకొచ్చింది. కాగా జెస్సికా 2002లో నిక్ లాచేను పెళ్లాడగా 2006లో విడాకులిచ్చింది. తర్వాత 2014లో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎరిక్ జాన్సన్‌ను పెళ్లాడింది.
చదవండి: పాపం అవకాశాల్లేక చిత్రవిచిత్ర డ్రెస్సులో కీర్తి సురేశ్
మేకప్ రూమ్‌లో పేలుడు, నటి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment