న్యూఢిల్లీ: మరో భారత మహిళా క్రికెటర్ ఇంట్లో కరోనా కారణంతో విషాదం నెలకొంది. యువ క్రికెటర్ ప్రియా పూనియా తల్లి సరోజ్ పూనియా కోవిడ్–19తో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ప్రియా భారత తరఫున 7 వన్డేలు, మూడు టి20లు ఆడింది. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో ప్రియా చోటు దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితం భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి కరోనాతో రెండు వారాల వ్యవధిలో తల్లిని, సోదరిని కోల్పోయింది.
ఈ విషయాన్ని పూనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో పంచుకుంది. '' నా జీవితంలో ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయా. మనకు ధైర్యం చెప్పేవాళ్లు పక్కన లేకపోతే ఎలా ఉంటుందో ఈరోజు తెలిసింది. లవ్ యూ మామ్.. నువ్వు నా గైడింగ్ స్టార్... నేను తీసుకునే ప్రతి స్టెప్ వెనుక నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు మమ్మల్ని భౌతికంగా విడిచిపెట్టి వెళ్లావంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నువ్వు లేవన్న నిజాన్ని ఒప్పుకొని ముందుకు సాగాల్సిందే. నీతో గడిపిన క్షణాలు ఒక జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. రెస్ట్ ఇన్ పీస్.. మామ్. ఇది చాలా డేంజరస్ వైరస్. దయచేసి అందరు ఇంట్లోనే ఉంటూ బౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ జాగ్రత్తగా ఉండండి'' అంటూ రాసుకొచ్చింది. దీంతో పాటు తన తల్లితో, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. 2019లో టీమిండియాకు అరంగేట్రం చేసిన ప్రియా పూనియా ఇప్పటివరకు 7 వన్డేలు.. మూడు టీ20లు ఆడింది. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పూనియా ఎంపికైంది.
చదవండి: Shafali Verma: వన్డేల కోసం శైలి మార్చుకుంటా
టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం
Published Tue, May 18 2021 1:55 PM | Last Updated on Wed, May 19 2021 1:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment