ముంబై: కరోనా మహమ్మారి టీమిండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నింపిన సంగతి తెలిసిందే. వేదా కృష్ణమూర్తి ఇంట్లో తొమ్మిది మంది కరోనా బారీన పడగా.. రెండు వారాల వ్యవధిలో తల్లిని, సోదరిని పోగొట్టుకుంది. ఈ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె తొలిసారిగా తన బాధను పంచుకుంది.
''జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరు నిర్ణయించలేరు. కరోనా మహమ్మారి మా జీవితాలను మార్చేసింది. మన అనుకున్నవాళ్లు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసింది. కరోనాతో చనిపోయిన అమ్మ, అక్క తిరిగి వస్తే బాగుండేదని అప్పుడప్పుడు అనిపించేది. కానీ ఇది. జీవితం.. ఒక్కసారి కోల్పోయింది మళ్లీ రాదని అర్థమైంది. వారితోనే నా సర్వస్వాన్ని కోల్పోయా. ఈ సమయంలో మానసిక స్థైర్యం బాగుండాలి. నా సోదరి వత్సల కరోనాతో చనిపోయేముందు తీవ్ర భయాందోళనకు గురైంది. నా తల్లి కూడా వైరస్‌తో భయపడిపోయింది. అంతేగాక నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో సహా కరోనా బారీన పడ్డారని తెలుసుకొని నా తల్లి చాలా ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాతే తాను ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం నుంచి తొందరగా బయటపడడానికి నాకు నేను దైర్యం చెప్పుకున్నా'' అంటూ చెప్పుకొచ్చింది.
కాగా ఇంగ్లండ్‌తో జరగనున్న టూర్‌కు వేదా కృష్ణమూర్తిని బీసీసీఐ ఎంపిక చేయలేదు. కాగా టీమిండియా తరపున వేదా కృష్ణమూర్తి 48 వన్డేల్లో 829 పరుగులు , 76 టీ20ల్లో 875 పరుగులు చేసింది.
చదవండి:
బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతా.. సూర్యను ట్రోల్ చేసిన రషీద్
Comments
Please login to add a commentAdd a comment