Veda Krishnamurthy
-
కర్ణాటక బ్యాటర్‌తో భారత మహిళా క్రికెటర్ 'ఎంగేజ్మెంట్'.. ఫొటోలు వైరల్
భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి, కర్ణాటక బ్యాటర్ అర్జున్ హొయసాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రికెటర్లు ఇద్దరూ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అదే విధంగా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో అర్జున్ మోకాళ్లపై కూర్చుని చాలా రొమాంటిక్‌గా వేదాకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వెటరన్ క్రికెటర్ వేదా టీమిండియా తరపున 48 వన్డేలు, 76 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. వేదా 2017 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులోనూ.. 2020 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా భాగంగా ఉంది. కాగా గత కొంత కాలంగా భారత జట్టుకు వేదా దూరంగా ఉంది. View this post on Instagram A post shared by Arjun Hoysala (@arjunhoysala) చదవండి: Asia Cup 2022: ఛాంపియన్ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
Veda Krishnamurthy: వాళ్లతోనే నా సర్వస్వం కోల్పోయా..
ముంబై: కరోనా మహమ్మారి టీమిండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నింపిన సంగతి తెలిసిందే. వేదా కృష్ణమూర్తి ఇంట్లో తొమ్మిది మంది కరోనా బారీన పడగా.. రెండు వారాల వ్యవధిలో తల్లిని, సోదరిని పోగొట్టుకుంది. ఈ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె తొలిసారిగా తన బాధను పంచుకుంది. ''జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరు నిర్ణయించలేరు. కరోనా మహమ్మారి మా జీవితాలను మార్చేసింది. మన అనుకున్నవాళ్లు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసింది. కరోనాతో చనిపోయిన అమ్మ, అక్క తిరిగి వస్తే బాగుండేదని అప్పుడప్పుడు అనిపించేది. కానీ ఇది. జీవితం.. ఒక్కసారి కోల్పోయింది మళ్లీ రాదని అర్థమైంది. వారితోనే నా సర్వస్వాన్ని కోల్పోయా. ఈ సమయంలో మానసిక స్థైర్యం బాగుండాలి. నా సోదరి వత్సల కరోనాతో చనిపోయేముందు తీవ్ర భయాందోళనకు గురైంది. నా తల్లి కూడా వైరస్‌తో భయపడిపోయింది. అంతేగాక నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో సహా కరోనా బారీన పడ్డారని తెలుసుకొని నా తల్లి చాలా ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాతే తాను ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం నుంచి తొందరగా బయటపడడానికి నాకు నేను దైర్యం చెప్పుకున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇంగ్లండ్‌తో జరగనున్న టూర్‌కు వేదా కృష్ణమూర్తిని బీసీసీఐ ఎంపిక చేయలేదు. కాగా టీమిండియా తరపున వేదా కృష్ణమూర్తి 48 వన్డేల్లో 829 పరుగులు , 76 టీ20ల్లో 875 పరుగులు చేసింది. చదవండి: బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతా.. సూర్యను ట్రోల్ చేసిన రషీద్ ఆమె బాధలో ఉంది.. బీసీసీఐ పట్టించుకోకపోవడం దారుణం -
ఆమె బాధలో ఉంది.. బీసీసీఐ పట్టించుకోకపోవడం దారుణం
ముంబై: టీమిండియ మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి జీవితంలో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపింది. రెండు వారాల వ్యవధిలో తన అక్కను, తల్లిని కోల్పోయింది. మొదట కరోనాతో పోరాడుతూ ఆమె అక్క వత్సల శివకుమార్ కన్నుమూయగా.. రెండు వారాల తర్వాత వేదా తల్లి కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. తన జీవితంలో ఒకేసారి జరిగిన రెండు విషాదాలు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశాయి. ఈ సందర్భంగా వేదా కృష్ణమూర్తికి తన తోటి క్రికెటర్లతో పాటు.. పలువురు మాజీ మహిళా క్రికెటర్లు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ .. మాజీ ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ లిసా స్టాలేకర్ కూడా ఉన్నారు. ఆమె వేదా కృష్ణమూర్తిని తన ట్విటర్ ద్వారా ఓదారుస్తూనే.. బీసీసీఐ తీరును విమర్శంచింది. ''వేదా తనకిష్టమైన ఇద్దరు వ్యక్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. అయితే బీసీసీఐ మాత్రం తమకేం పట్టదన్నట్లుగా వ్యవహరించడం దారుణం. ఆమె అంత బాధలో ఉంటే కనీసం పరామర్శించకపోవడం ఆశ్చర్యపరిచింది. సరిగ్గా ఈ సమయంలోనే బీసీసీఐ ఇంగ్లండ్ టూర్‌కు జట్టును ఎంపికచేసింది. వేదా కృష్ణమూర్తిని జట్టులోకి తీసుకోలేదు.. ఆమె బాధలో ఉందని ఎంపికచేయకపోవడం అనుకున్నా.. ఇలా చేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదు. టీమిండియా మహిళల జట్టులో వేదా కృష్ణమూర్తిది కీలకస్థానం. ఆమె ఒక సీనియర్.. భారత్ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడింది. తన వాళ్లను కోల్పోయి బాధలో ఉన్న ఆమెతో బీసీసీఐ ఎలాంటి కమ్యునికేషన్ జరపలేదు. బాధలో ఉండి ఒంటరిగా ఉన్నప్పుడే అన్ని సమస్యలు ఎదురవుతాయి.. బీసీసీఐది సరైన పద్దతి కాదు'' అంటూ విమర్శలు చేసింది. ఇక వేదా కృష్ణమూర్తి టీమిండియా తరపున 48 వన్డేల్లో 829 పరుగులు.. 76 టీ20ల్లో 875 పరుగులు చేసింది. ఇక లిసా స్టాలేకర్ 2001 నుంచి 2013 వరకు ఆసీస్ తరపున ప్రాతినిధ్యం వహించింది. మంచి వుమెన్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన లిసా 125 వన్డేల్లో 2278 పరుగులు.. 146 వికెట్లు, 4 టెస్టుల్లో 416 పరుగులు.. 23 వికెట్లు, 54 టీ 20ల్లో 769 పరుగులు.. 60 వికెట్లు సాధించింది. చదవండి: అమ్మా.. అక్కా.. గుండె పగిలిపోతోంది ఆ క్రికెటర్ ఇంట్లో మరోసారి విషాదం..! There is still time to fix this!! pic.twitter.com/LT3hApMioJ — Lisa Sthalekar (@sthalekar93) May 15, 2021 -
అమ్మా.. అక్కా.. గుండె పగిలిపోతోంది: క్రికెటర్ భావోద్వేగం
బెంగళూరు: ‘‘ప్రియమైన.. అందమైన అమ్మ.. అక్క... మన పొదరింటిని నిలబెట్టింది మీరిద్దరే. ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. గత కొన్నిరోజులుగా మన ఇంట్లో జరుగుతున్న పరిణామాలు గుండెను బద్దలు చేస్తున్నాయి. అమ్మా... ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యవంతురాలిగా నన్ను పెంచావు. నాకు తెలిసిన అత్యంత అందమైన మనసు గల, నిస్వార్థమైన వ్యక్తివి నువ్వే. అక్కా.. నీకు అత్యంత ఇష్టమైన చెల్లిని నేనని నాకు తెలుసు. నువ్వొక యోధురాలివి. చివరి నిమిషం దాకా ఎలా పోరాడాలో నాకు నేర్పించావు. మీరిద్దరూ.. నా ప్రతిమాటలో.. నేను చేసే ప్రతిపనిలో సంతోషం వెదుక్కునే వారు. మీకు తెలుసా.. నాకు ఇద్దరు అమ్మలు అనే గర్వం నాలో ఉండేది. కానీ.. ఏ మనిషికీ ఇంత గర్వం పనికిరాదు. గతకొన్ని రోజులుగా మీతో గడిపిన సంతోష క్షణాలే ఆఖరు అవుతాయని నేను ఊహించలేకపోయాను. మీరిద్దరు నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయిన తర్వాత నా ప్రపంచమంతా తలకిందులైపోయింది. మీ ఇద్దరినీ నేనెంతగా ప్రేమిస్తానో అంతే మిస్సవుతున్నాను కూడా.. నాకింతటి ప్రేమను పంచినందుకు ధన్యవాదాలు’’ అంటూ భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిని, అక్కను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. కాగా వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబా గత నెల 23న కరోనాతో మృతి చెందగా.. ఆమె అక్క వత్సల కోవిడ్‌తో మే 6న కన్నుమూశారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో వేద కృష్ణమూర్తి అమ్మ, అక్కతో తనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా సోమవారం ట్విటర్ వేదికగా ఓ నోట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఉద్వేగానికి లోనైన ఆమె.. ‘‘నాలాంటి బాధను అనుభవిస్తున్న వారిని తలచుకుంటుంటే మనస్సు తరుక్కుపోతోంది. నిజానికి మా కుటుంబం చాలా జాగ్రత్తలు పాటించింది. అయినా మహమ్మారి మా ఇంటి వరకు వచ్చిది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించండి. సురక్షితంగా, ధైర్యంగా ఉండండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా బెంగళూరుకు చెందిన వేద కృష్ణమూర్తి భారత్ తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్‌లు ఆడి 875 పరుగులు సాధించారు. To my dearest Amma and Akka ❤️ pic.twitter.com/NLj7kAYQXN — Veda Krishnamurthy (@vedakmurthy08) May 10, 2021 -
ఆ క్రికెటర్ ఇంట్లో మరోసారి విషాదం..!
బెంగళూరు: భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట మరోసారి విషాదం చోటు చేసుకుంది. గత ఏప్రిల్ 23న కరోనా వైరస్ కారణంగా వేద తల్లి చెలువాంబా దేవి మృతి చెందగా... బుధవారం సాయంత్రం వేద సోదరి వత్సల కరోనాతో పోరాడి తనువు చాలించింది. 42 ఏళ్ల వత్సల చిక్మగళూరులోని ఓ ఆసుపత్రిలో రెండు వారాలపాటు చికిత్స పొందింది. ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండటంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కడూర్‌లో నివసించే వేద తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఏప్రిల్ ఆరంభంలో కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో కుటుంబసభ్యులతో గడిపిన 28 ఏళ్ల వేద బెంగళూరుకు తిరిగి వచ్చి ఐసోలేషన్‌లో గడిపింది. ఆమెకు కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. బెంగళూరుకు చెందిన వేద కృష్ణమూర్తి భారత్ తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్‌లు ఆడి 875 పరుగులు సాధించింది. It is with great sadness that last night my family had to say goodbye to My Akka My family, my world has been rocked to its core. Appreciate all the messages and prayers . My thoughts with everyone going through these devastating times. Hold your loved ones tight and stay safe 🙏 — Veda Krishnamurthy (@vedakmurthy08) May 6, 2021 చదవండి: అదే మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం: రోహిత్ -
కరోనాతో వేద కృష్ణమూర్తి తల్లి మృతి
సాక్షి, బెంగళూరు: భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబ్డా దేవి శనివారం తుదిశ్వాస విడిచారు. వేద సోదరి కూడా ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ‘అమ్మ మరణంతో మా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఇప్పుడు మా సోదరి క్షేమంగా, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’ అని వేద వ్యాఖ్యానించింది. 28 ఏళ్ల వేద భారత మహిళల జట్టు తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్‌లు ఆడి 875 పరుగులు సాధించింది. -
ఐసోలేషన్ క్రికెట్ కప్..
-
వైరల్: ఐసోలేషన్ క్రికెట్ కప్.. ఐసీసీ ట్వీట్
హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. మహమ్మారి కరోనా దెబ్బకు టోక్యో ఒలింపిక్స్, టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్, ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీలు, సిరీస్‌లు వాయిదా పడటమో లేక రద్దవ్వడమో జరిగాయి. దీంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్డౌన్ సమయంలో కొందరు ఆటగాళ్లు తమ వ్యాపకాలు, వంటలకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే మరికొంత మంది తమ మెదడుకు మేత వేస్తూ సృజనాత్మకంగా ఆలోచించి వీడియోలను రూపొందిస్తున్నారు. టీమిండియా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అండ్ టీం తమ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ‘ఐసోలేషన్ క్రికెట్ కప్’ పేరిట వినూత్న వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘లాక్డౌన్ సమయంలో మేము క్రికెట్‌ను ఎక్కువగా మిస్సవుతున్నాం. అందుకే మాకు మేమే సొంతంగా మా ఇంట్లోనే ఓ లీగ్‌ను ప్రారంభించాం. అదే ఐసోలేషన్ క్రికెట్ కప్(ఐసీసీ)’ అంటూ వేద కృష్ణమూర్తి ట్వీట్ చేశారు. బ్యాటర్, బౌలర్, అంపైర్, కామెంటేటర్, కీపర్, ఫీల్డర్, ఆడియన్స్ ఇలా అందరూ ఉన్న ఈ లీగ్‌కు సంబంధించిన వీడియోను సైతం పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా వేద ప్రారంభించిన క్రికెట్ లీగ్‌కు ఫిదా అయింది. అంతేకాకుండా త్వరలోనే ఐసోలేషన్ క్రికెట్ కప్ తారాస్థాయికి చేరుకుంటుందని సరదాగా వ్యాఖ్యానించింది. ఇక వేద అండ్ టీంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఆలోచన బాగుందని, లైవ్ కామెంటరీ రియలిస్టిక్‌గా ఉందని, ఆడియన్స్ చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టి20 ప్రపంచకప్‌ను రద్దు చేయకండి ప్రియాంక, కరీనా ఇష్టం.. స్టెయిన్ కష్టం -
మేమే ఫేవరెట్...
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా నాలుగుసార్లు విశ్వ విజేత అయినప్పటికీ ఈసారి ఫైనల్లో తమ జట్టే ఫేవరెట్‌గా అనిపిస్తోందని భారత సీనియర్ బ్యాటర్ వేద కృష్ణమూర్తి తెలిపింది. ఫైనల్లో టీమిండియానే గెలుస్తుందని తనకు గట్టి నమ్మకముందని ఆమె చెప్పింది. ‘ఇదంతా విధి రాత. నేను దీన్ని బాగా నమ్ముతాను. ట్రోఫీ గెలుస్తామనే విశ్వాసం ఉంది. అయితే ఈ ప్రపంచకప్ భారత్‌కు అనుకూలంగానే రూపొందించారనడం హాస్యాస్పదం. వికెట్లు, వాతావరణం సంగతెలా ఉన్నా మేం బాగా ఆడామన్నది నిర్వివాదాంశం. నిజానికి మేం ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. అలా మొదటి దశను పూర్తి చేశాం. ఇప్పుడు అంతిమ దశ మిగిలుంది. ఆఖరి పోరులో ఏం చేయాలో కచ్చితంగా అదే చేస్తాం’ అని వేద పేర్కొంది. భారత్ 2017లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడి చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ జట్టులో వేద కూడా ఉంది. అయితే ఫైనల్ దాకా వచ్చి ట్రోఫీని చేజార్చుకోవడం జీర్ణించుకోలేని బాధను మిగులుస్తుందని ఆమె గత పరాజయం తాలుకు జ్ఞాపకాలను వెల్లడించింది. ‘వ్యక్తిగతంగా నా పాత్రను నేను చక్కగా పోషించాను. జట్టు లో అందరిని కలుపుకొని వెళ్లాను. ఏదో ఒకరిద్దరని కాకుండా... ప్రతీ ఒక్కరిని ఉత్సాహపరుస్తూనే ఉన్నాను’ అని 27 ఏళ్ల వేద తెలిపింది. ఈ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించే... ఈ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టడం విశేషం. అమ్మో... పవర్‌ప్లేలో వాళ్లిద్దరికి బౌలింగా? భారత్‌తో తలపడటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్న ఆసీస్ బౌలర్ మేగన్ షూట్ పవర్ ప్లేలో భారత స్టార్ బ్యాటర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలకు బౌలింగ్ చేయలేనని చెప్పింది. షూట్ వేసిన టోర్నీ ఓపెనింగ్ ఓవర్లో నాలుగు బౌండరీలు బాదిన షఫాలీ ఈ మెగా ఈవెంట్‌కే మెరుపు ఆరంభాన్నిచ్చింది. ‘స్మృతి, షఫాలీ నన్ను అలవోకగా ఎదుర్కొంటారు. ముక్కోణపు సిరీస్‌లో షఫాలీ కొట్టిన సిక్సర్ ఇప్పటికీ మర్చిపోలేదు. నేను చూసిన భారీ సిక్సర్లలో అది ఒకటి. అందుకే పవర్‌ప్లేలో వారికి ఎదురుపడటం నాకిష్టం లేదు’ అని షూట్ చెప్పింది. ఏదేమైనా మా వ్యూహాలు మాకుంటాయని తప్పకుండా వాటిని ఆచరణలో పెడతామని చెప్పింది. ‘ఫైనల్’ ఫీల్డ్ అంపైర్లు వీరే... ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే అంతిమ పోరాటంలో న్యూజిలాండ్‌కు చెందిన కిమ్ కాటన్, పాకిస్తానీ అహ్సాన్ రజా ఫీల్డు అంపైర్లు గా వ్యవహరిస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. గ్రెగరీ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) మూడో అంపైర్‌గా ఉంటారు. అహ్సాన్ రజా 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించింది. -
విండీస్‌ను ఊడ్చేశారు..
ప్రావిడెన్స్ (గయానా): వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత మహిళలు జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే నాలుగు టీ20ల్లో జయభేరి మోగించిన టీమిండియా.. గురువారం జరిగిన నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో గెలుచుకుంది. సిరీస్ ఆరంభం నుంచి ఎదురేలేని టీమిండియా టీ20 చాంపియన్‌ను గజగజా వణికించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ రోడ్రిగ్స్(50; 56 బంతుల్లో 3ఫోర్లు), వేద కృష్ణమూర్తి(57 నాటౌట్; 48 బంతుల్లో 4ఫోర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 73 పరుగులే చేసి ఓటమిపాలైంది. కిషోనా నైట్(22) ఓ మోస్తారుగా రాణించగా మిగతా బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అనూజా పాటిల్ రెండు, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, పూజా, హర్లీన్‌లు తలో వికెట్ పడగొట్టారు. రాణించిన రోడ్రిగ్స్, వేద టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. షెఫాలీ వర్మ(9), స్మృతి మంధాన(7) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు. తొలుత ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో స్కోర్ ముందుకు కదిలింది. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ చివరి రెండో బంతికి రోడ్రిగ్స్ వెనుదిరిగింది. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలోనూ పోరాటపటిమను ప్రదర్శిచంలేదు. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాటపట్టారు. దీంతో విండీస్‌కు ఘోర ఓటమి తప్పలేదు. -
బీబీఎల్ లో మరో భారత క్రీడాకారిణి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడటానికి మరో భారత క్రీడాకారిణికి అవకాశం దక్కింది. ఇప్పటికే ఈ లీగ్ లో ఇద్దరు భారత క్రీడాకారుణులు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధన ఆడుతుండగా, తాజాగా ఇందులో ఆడేందుకు మరో భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తికి అవకాశం దక్కింది. బీబీఎల్ మహిళల మూడో ఎడిషన్ లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడేందుకు వేదా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు వేద మాట్లాడుతూ.. బీబీఎల్ ఆడే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నెలరోజుల క్రితమే హరికేన్స్ యాజమాన్యంతో మాట్లాడా. ఆపై హర్మన్, మంధనాలతో చర్చించా. కాకపోతే అప్పటికి సఫారీల షెడ్యూల్ ఖరారు కాలేదు. దాంతో అప్పుడు వారితో ఏమీ చెప్పలేదు. మా దక్షిణాఫ్రికా పర్యటన ఫిబ్రవరిలో ఉండటంతో బీబీఎల్ ఆడేందుకు నాకు మార్గం సుగుమం అయ్యింది. దాంతో హరికేన్స్ నిర్వహకులతో మాట్లాడి ఒప్పందం చేసుకున్నా. ఆ జట్టుతో 10 మ్యాచ్ లతో మాత్రమే ఆడతా.ఈ విషయాన్ని వారితో చెప్పా. అందుకు హరికేన్స్ యాజమాన్యం ఒప్పుకుంది'అని వేద పేర్కొన్నారు. బీబీఎల్ లో సిడ్నీ థండర్స్ తరపున హర్మన్ ఆడుతుండగా, బ్రిస్బేన్ హీట్ కు మంధన ఆడుతున్న సంగతి తెలిసిందే. -
భారత్ ఆశలపై వర్షం
► డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ► 2 పరుగులతో పాకిస్తాన్ విజయం ► మహిళల టి20 ప్రపంచకప్ న్యూఢిల్లీ: చేసింది కేవలం 96 పరుగులే... అయినా భారత మహిళలు పోరాడారు. ఓ దశలో అలవోక విజయం దిశగా సాగుతున్న పాకిస్తాన్ మహిళలను కట్టడి చేశారు. పది బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు తెచ్చుకున్నారు. ఇక పాకిస్తాన్ విజయం కోసం 24 బంతుల్లో 20 పరుగులు చేయాలి. క్రీజులో మిగిలిన వాళ్లంతా బౌలర్లు. కాబట్టి భారత్ గెలుపు అవకాశాలు బాగా పెరిగాయి. ఇలాంటి స్థితిలో వరుణుడు మిథాలీసేన ఆశలపై నీళ్లుజల్లాడు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ రెండు పరుగులతో విజయం సాధించింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గట్టెక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 96 పరుగులు చేశారు. వేద కృష్ణమూర్తి (19 బంతుల్లో 24; 3 ఫోర్లు) రాణించగా... మిథాలీ (35 బంతుల్లో 16; 1 ఫోర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (19 బంతుల్లో 16; 2 ఫోర్లు), జులన్ గోస్వామి (14 బంతుల్లో 14) మోస్తరుగా ఆడారు. మిథాలీ, హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 29; వేద, గోస్వామి ఐదో వికెట్‌కు 22 పరుగులు సమకూర్చడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం పాకిస్తాన్ 16 ఓవర్లలో 6 వికెట్లకు 77 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. నహిదా ఖాన్ (14), మునీబా అలీ (12 నాటౌట్), ఇరామ్ జావేద్ (10) పోరాడారు. ఆరంభంలో విఫలమైన భారత బౌలర్లు చివర్లో మాత్రం విజృంభించారు. ఓ దశలో 70/3 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న పాక్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. 10 బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీయడంతో స్కోరు 77/6గా మారింది. ఈ దశలో భారీ వర్షం పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. చివరకు డక్‌వర్త్ పద్ధతిలో పాక్‌కు స్వల్ప విజయం దక్కింది. అనమ్ అమిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: మిథాలీ (సి) సిద్రా అమిన్ (బి) నిడా దర్ 16; వనిత (సి) సనా మిర్ (బి) అనమ్ అమిన్ 2; మందన ఎల్బీడబ్ల్యు (బి) అస్మవి ఇక్బాల్ 1; హర్మన్‌ప్రీత్ (సి) సిద్రా అమిన్ (బి) సాడియా యూసుఫ్ 16; వేద కృష్ణమూర్తి (సి అండ్ బి) సనా మిర్ 24; జులన్ గోస్వామి రనౌట్ 14; అనుజా పాటిల్ రనౌట్ 3; శిఖా పాండే నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1-3; 2-5; 3-34; 4-49; 5-71; 6-80; 7-96. బౌలింగ్: అనమ్ అమిన్ 4-0-9-1; అస్మవి ఇక్బాల్ 4-0-13-1; సనా మిర్ 4-0-14-1; సాడియా యూసుఫ్ 3-0-24-1; బిస్మా మహరూఫ్ 2-0-12-0; నిడా డర్ 3-0-23-1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: నహిదా ఖాన్ (సి) కౌర్ (బి) పాండే 14; సిద్రా అమిన్ (బి) గైక్వాడ్ 26; బిస్మా (సి) గోస్వామి (బి) కౌర్ 5; మునీబా నాటౌట్ 12; ఇరామ్ జావేద్ (సి) మిథాలీ (బి) గోస్వామి 10; అస్మావి ఇక్బాల్ రనౌట్ 5; సనా మిర్ రనౌట్ 0; నిడా డర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (16 ఓవర్లలో 6 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1-19; 2-48; 3-50; 4-71; 5-77; 6-77. బౌలింగ్: అనుజా పాటిల్ 3-0-14-0; రాజేశ్వరి గైక్వాడ్ 2-0-11-1; శిఖా పాండే 2-0-14-1; జులన్ గోస్వామి 4-0-14-1; పూనమ్ యాదవ్ 3-0-14-0; హర్మన్‌ప్రీత్ 2-0-9-1.